రామ్ చ‌ర‌ణ్ వ‌ల్ల ఫ్లాప్ అవ్వ‌బోతున్న `లియో`.. ఇదెక్క‌డి త‌ల‌నొప్పి రా బాబు!?

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్ష‌న్ లో రూపుదిద్దుకున్న అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `లియో`. చెన్నై సోయ‌గం త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తే.. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యాన‌ర్ పై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు.

ఈ మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ అక్టోబ‌ర్ 19న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ ప్ర‌మోష‌న్స్ ఊపందుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ నెట్టింట వైర‌ల్ గా మారింది. అదేంటంటే.. లియోలో గ్లోబ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గెస్ట్ రోల్ లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ అమెరికాలో ప్రారంభమయ్యాయి. అయితే ఓ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ లియో మూవీలోని నటీనటుల వివరాల్లో రామ్ చరణ్ పేరును కూడా చేర్చింది.

దీంతో లియోలో రామ్ చ‌ర‌ణ్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడ‌న్న వార్త ఊపందుకుంది. ఈ ప్ర‌చారంతో ద‌ళ‌ప‌తి ఫ్యాన్స్ లో లేనిపోని త‌ల‌నొప్పి మొద‌లైంది. ఇటీవ‌ల బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ హీరోగా వ‌చ్చిన `కిసీ కా భాయ్ కిసీ కి జాన్` మూవీలో రామ్ చ‌ర‌ణ్ గెస్ట్ రోల్ లో మెరిశాడు. క‌ట్ చేస్తే ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అయింది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ లియోకి ఎక్క‌డ రిపీట్ అవుతుందో అని విజ‌య్ ఫ్యాన్స్ వ‌ర్రీ అవుతున్నార‌ట‌. రామ్ చ‌ర‌ణ్ వ‌ల్ల సినిమా ఫ్లాప్ అవుతుందేమో అని భ‌య‌ప‌డుతున్నార‌ట‌. ఏదేమైనా క‌థ‌లో ద‌మ్ము ఉండాలే కానీ.. ఎవ‌రో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చినంత మాత్రానా సినిమా ఫ్లాప్ అవుతుంద‌ని అనుకోవ‌డం అవివేక‌మే అవుతుంది.