పెళ్లి చేసుకోమంటూ మంచు మనోజ్ ని వేధించిన స్టార్ హీరోయిన్..!!

తెలుగు ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండో వివాహం చేసుకొని సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు.అయితే ఈయన మొదటి వివాహం ప్రణీత రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇక వీరిద్దరి వివాహ వేడుకకు చాలామంది సెలబ్రిటీలు సైతం రావడం జరిగింది అయితే వీరి వివాహమైనటువంటి ఏడాదికే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. అలా విడిపోవడానికి కారణం ఏంటని విషయం పై ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయట.

అయితే ఒక హీరోయిన్ కారణంగానే మంచు మనోజ్, ప్రణీత రెడ్డి విడిపోవడం జరిగిందట.. అందుకు సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరోయిన్ మనోజ్ తో కలిసి కేవలం ఒక సినిమాలో మాత్రమే నటించింది. ఆ తర్వాత ఆయన పైన ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇష్టం ఏర్పడి తనని పెళ్లి చేసుకోవాలని చాలా వేధింపులకు గురిచేసిందట.

ఇలా మనోజ్ ని ప్రేమిస్తున్నానంటూ ఆ హీరోయిన్ పెళ్లి చేసుకోమని వెంటపడడంతో మంచు మనోజ్ కు మాత్రం ఆల్రెడీ వివాహం జరిగిందని నాకు నీ పైన ఎలాంటి ఉద్దేశం లేదని చెప్పి పంపాడట. ఇలా మనోజ్ ఎంత చెప్పినా ఆ హీరోయిన్ వినకుండా తనను వేధింపులకు గురి చేసిందని ఈ విషయం మోహన్ బాబు వరకు వెళ్లిందట.. దీంతో ఆ హీరోయిన్ ఇంటికి పిలిచి మరి వార్నింగ్ ఇచ్చారట..అయినప్పటికీ కొత్త నెంబర్లతో మనోజ్ కి సైతం ఫోన్ చేస్తూ వేధిస్తూనే ఉండడంతో ప్రణీత, మనోజ్ మధ్య గొడవలు చోటుచేసుకుని ఆ గొడవలు పెద్దవి కావడంతో చివరికి విడాకులు తీసుకొనే పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం .మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.