ప్ర‌భాస్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బ‌న్నీ.. ఇంత‌కీ ఈ సినిమా ఏదో తెలుసా?

ప్రాంతీయ హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన‌ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ మ‌రొక‌టి పడకపోయినా.‌. ప్రభాస్ క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. స్టార్ డైరెక్టర్లు, బ‌డా బ‌డా నిర్మాణ సంస్థలు ప్రభాస్ తో సినిమా చేసేందుకు పోటీ పడుతూనే ఉన్నాయి. ఈ సంగతి పక్కన పెడితే ప్రభాస్ త‌న రెండున్న‌ర ద‌శాబ్దాల సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు.

అందులో అల్లు అర్జున్‌ బ్లాక్ బస్టర్ మూవీ కూడా ఉంది. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు `ఆర్య`. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీలో అల్లు అర్జున్‌, శివ బాలాజి, అనురాధ మెహతా ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. దిల్ రాజు ఈ మూవీని నిర్మించారు. 2004లో విడుద‌లైన ఆర్య బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. ఆ త‌ర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గా ఆర్య 2 రాగా.. అది కూడా మంచి విజ‌యం సాధించింది.

అయితే నిజానికి ఆర్య మూవీ ప్ర‌భాస్ చేయాల్సింది. సుకుమార్ మొద‌ట ఆర్య స్టోరీని ప్ర‌భాస్ కు వినిపించాడు. ప్ర‌భాస్ కు కూడా ఆర్య క‌థ న‌చ్చింది. కానీ, అప్ప‌టికే డార్లింగ్ `వ‌ర్షం` మూవీకి క‌మిట్ అయ్యాడు. వ‌ర్షం సినిమాలో హీరోయిన్ కోసం ఇద్ద‌రు కొట్టుకుంటారు. అలాగే బ్యాక్‌డ్రాప్ వేరైనా ఆర్య మూవీలోనూ హీరోయిన్ కోసమే ఇద్ద‌రు పోటీ ప‌డ‌తారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భాస్ ఆర్యను సున్నితంగా రిజెక్ట్ చేశాడు. ఆ త‌ర్వాత బ‌న్నీ అదే క‌థ‌తో సినిమా చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు.