“ఛీ ఛీ..అలాంటి ప్రశ్నలు అస్సలు అడగద్దు”..మీడియా పై ఫైర్ అయిన తమన్నా.!!

పాపం మిల్కీ బ్యూటీ తమన్నా టైం అస్సలు బాగాలేదు.. ఈ మధ్యకాలంలో ఆమె ఏం సినిమా చేసిన సరే అది ఫ్లాప్ గా మారుతుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఆమె పట్టిందల్లా బంగారమే అన్నట్లు సూపర్ సక్సెస్ అందుకుంటుంది . ఆమె నటించిన వెబ్ సిరీస్ అన్ని సూపర్ సక్సెస్ అవ్వడం ..ఇలాంటి క్రమంలోనే ఓ మీడియా ఇంటరాక్షన్ లో పార్టిసిపేట్ చేసిన తమన్నా కు రిపోర్టర్స్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది .

మీరు కెరియర్ స్టార్టింగ్ లో చాలా పద్ధతిగా కనిపించారు. ఆ తర్వాత లిమిట్స్ క్రాస్ చేశారు.. ఇప్పుడు పూర్తిగా బోల్డ్ పర్ఫామెన్స్ ఇస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో మీ అవకాశాలు తగ్గడం వల్లనే ఇలా బోల్డ్ పర్ఫామెన్స్లు ఇస్తున్నారా..? అంటూ రిపోర్టర్ ప్రశ్నించగా .. ఫుల్ ఫైర్ అయిపోయిన తమన్నా.. అసలు మీకు నాకు అవకాశాలు లేవని ఎవరు చెప్పారు .. రోజుకి 18 గంటలకు కష్టపడుతున్నాను .. నా కెరియర్ లో ఈ విధంగా నేను ఎప్పుడు కష్టపడలేదు .

అంతేకాదు చాలా చాలా ఆఫర్స్ నా చేతిలో ఉన్నాయి. నోటికి వచ్చినట్లు మాట్లాడడం ..చేతికి వచ్చింది రాయడం అన్నంత ఈజీ కాదు నటించడం ..కొన్ని కొన్ని పాత్రలకు మనం ఎలా నటిస్తే బాగుంటుంది అని ఆ పాత్రలకు తగ్గ రేంజ్ లో నటించాల్సి ఉంటుంది.. లిమిట్స్ పెట్టుకుంటే ఇండస్ట్రీలో హీరోయిన్గా రాలేము అంటూ కూసింత ఘాట్టిగానే రిపోర్టర్కు ఇచ్చి పడేసింది . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు తమన్నా మాట్లాడిన మాటలు వీడియో వైరల్ గా మారింది..!!