ముద్దులతో రెచ్చిపోయిన కొడుకు రోష‌న్‌.. రాజీవ్‌ను ప‌క్క‌కు లాక్కెళ్లిన సుమ..!

స్టార్ నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ కుమారుడు రోషల్ కనకాల వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.” రవికాంత్ పారెపు ” దర్శకత్వంలో ” బబుల్గమ్ ” అనే సినిమాలో రొమాంటిక్ గా నటిస్తున్నాడు. ఇందులో కథానాయకగా మానసా చౌదరి చెరుకూరి నటిస్తోంది. అయితే ఈ టీజర్ లో కిస్ సీన్ ఉంటుంది. దీనిపై స్వయంగా రాజీవ్ కనకాల మాట్లాడటం జనాలను ఉక్కిరి బిక్కిరి చేసింది.

అయితే తాజాగా హైదరాబాద్లో ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు రాజీవ్ కనకాల కూడా హాజరయ్యారు. ” రోషన్ చాలా బాగా చేశావ్.. సినిమాలో కూడా బాగా చేస్తుంటావని అనుకుంటున్నాను. టీజర్ లో చివరాకరి షూట్ చూసి రాజీవ్‌ కనకాల మాట్లాడటం ఆపేసి నవ్వుతూ అలా ఉండిపోయాడు. తన భార్య సుమ వెంటనే దగ్గరకొచ్చి..” కొన్ని మాట్లాడకుండా ఉంటేనే బెటర్ రాజా, పద అంటూ రాజీవ్ కనకాలను లాక్కుని తీసుకుళ్లిపోతుంది.

అనంతరం రాజీవ్.. ” సరే అలాగే జనరల్ గా వాళ్లకు అనిపించింది నేను చెప్పాను. అవునా కాదా? అని రాజీవ్ అనేసరికి అందరూ ఒక్కసారిగా గట్టిగా అరిచారు. ఇంకా మనం ఏమేం చూడటానికి మిగిలిందో ? ఇది టీజర్ మాత్రమే అని పక్కనే ఉన్న సుమ అంటుంది “. ఇదంతా ఫన్నీగా జరిగినప్పటికీ జనాలు మాత్రం తల్లిదండ్రులు అలా మాట్లాడటం సరైనది కాదని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.