” లియో ” ప్రొడక్షన్ హౌస్ తో చరణ్ భారీ సినిమా.. అదేంటో తెలుసా..?

ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర మంచి హైప్‌ లో ఉన్న లేటెస్ట్ సినిమాల్లో విజయ్ దళపతి హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ లియో ఒక‌టి. అయితే ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.

అయితే ఇది నిజమని క్లారిటీ వచ్చేసింది. ఇక చెర్రీకి సంభంధించి లేటెస్ట్‌గా మరో వార్త వినిపిస్తుంది. లియో సినిమాలో చరణ్ ఉండటం ఉండకపోవడం పక్కన పెడితే.. ఈ సినిమా నిర్మాణ సంస్థ 7 స్క్రీన్స్ స్టూడియోస్ వారు అయితే చరణ్తో టచ్ లో ఉన్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ పై ఇంట్రెస్టింగ్ బజ్ మొదలైంది.

మరి ఇది ఏ ప్రాజెక్ట్ కోసం అనే ఇతర వివరాలు ఇంకా బయటకి రావాల్సి ఉన్నాయి. ప్రస్తుతం అయితే చరణ్ దర్శకుడు శంకర్ తో భారీ సినిమా ” గేమ్ చేంజర్ ” చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.