” అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ ” ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా..?

నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ” భగవంత్ కేసరి ” మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా శ్రీ లీల కీలక పాత్రలు పోషిస్తుండగా.. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది దీనిని గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీపై బాలయ్య ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ మూవీ అక్టోబర్ 19న ప్రేక్షకులు ముందుకి రానుంది. ఇక మరోవైపు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఇప్పటికే ” అన్ స్టాపబుల్ ” రెండు సీజన్స్ లో హోస్ట్ గా అదరగొట్టి ఆకట్టుకున్న బాలయ్య తాజాగా ” అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ ” ద్వారా ఆడియన్స్ ముందుకి రానున్నారు. ఈ తాజా సీజన్ యొక్క ఫస్ట్ ఎపిసోడ్ గ్రాండ్ లెవెల్ లో అక్టోబర్ 17న ఆహా లో టెలికాస్ట్ కానుండగా.. ఈ ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీం ప్రత్యేకంగా సందడి చేయనుంది.

కాగా భగవంత్ కేసరి హీరోయిన్ కాజల్, శ్రీ లీల, విలన్ పాత్రధారి అర్జున్ రామ్ పాల్, డైరెక్టర్ అనిల్ రావిపూడి విచ్చేసిన ఈ ఎపిసోడ్ యొక్క పిక్స్ ని తాజాగా ఆహా టీమ్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.