సీఎం జగన్ కి, విజయ్ దేవరకొండ కి మధ్య ఒక పోలిక ఉంది.. అదేంటో తెలుసా…

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విజయ్, సమంత రీసెంట్ గా నటించిన ‘ఖుషి ‘ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ సక్సెస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ విజయ్ తన రెమ్యూనరేషన్ నుండి కోటిరూపాయలను 100 మంది అభిమానులకు లక్ష రూపాయల చొప్పున ఇస్తానని మాట ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇందుకోసం పది రోజుల సమయం తీసుకున్న విజయ్ ఒక ఫామ్ తీసుకొని రిజిస్టర్ అవ్వండి అంటూ అభిమానులకు సలహా ఇచ్చాడు.

ప్రస్తుతం తన మాట నిలబెట్టుకోవడం కోసం మరో ముందడుగు వేసాడు విజయ్. తాజాగా లక్ష రూపాయలు అందుకోబోతున్న 100 మంది అభిమానుల జాబితాను ఆఫీషియల్ గా ప్రకటించాడు విజయ్ దేవరకొండ. ‘ ఇవే మేం ఎంపిక చేసిన 100 మంది జాబితా. లక్ష రుపాయలను వారి కుటుంబాలకు అందజేస్తాను ‘ అంటూ ప్రకటించాడు. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమా సూపర్ హిట్ గా నిలిచి 70 కోట్లకు పైగా గ్రాస్ ని వసూలు చేసింది.

ఈ సందర్భంగా నిర్వహించిన ఖుషి సినిమా సక్సెస్ మీట్ లో మనం రౌడీ హీరో కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఆ సందర్బంగా ఖుషి సినిమా ని సక్సెస్ చేసిన అభిమానులకు లక్ష రూపాయలు సహాయం చేస్తాను అంటూ ప్రకటించాడు. తన సంతోషాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకోడం కోసమే 100 మంది అభిమానుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున మొత్తం కోటి రూపాయలు సహాయం చేస్తాను అంటూ ప్రకటించాడు విజయ్. దానికోసం సోషల్ మీడియా వేదికగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ని కూడా తయారు చేయించాడు. ఇక ఇప్పుడు ఆ వందమంది కుటుంబాలను అధికారికంగా ప్రకటించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇదంతా చూసిన అభిమానులు విజయ్ కూడా అచ్చం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి లానే ఇచ్చిన మాట తప్పడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.