పాపం తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు ఇప్పుడు లోకేష్ బాబు పరిస్థితి ఎటు కానీ స్థితికి చేరుకునేసింది. అటు రోలు కు ఇటు రోకలికి కానీ పచ్చడిగా మిగిలిపోయాడు లోకేష్ బాబు . ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజెంట్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ భారీ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా చంద్రబాబు పేరు గట్టిగా వినిపించింది. ఈ క్రమంలోనే ఆయనను నిందితుడిగా తేలుస్తూ కోర్ట్ ఆయనకు రిమాండ్ విధించింది . కాగా ప్రజెంట్ చంద్రబాబునాయుడు రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారు .
ఇలాంటి క్రమంలోనే టిడిపి పగ్గాలను చేతికి తీసుకొని బాలకృష్ణ తనదైన స్టైల్ లో ముందుకు వెళ్తున్నాడు. కాగా రీసెంట్ గానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి తో కలిసి ముందుకు వెళ్ళబోతున్నామని 2024 ఎన్నికల్లో మేమేంటో చూపిస్తామని భారీ భారీ డైలాగ్స్ కొట్టారు. అయితే ఇంతవరకు ఓకే టిడిపి.. జనసేన కలిసి పొత్తు పెట్టుకుని ముందుకెళ్తే జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు.. కాస్త కూస్తో ఓట్లు కూడా వస్తాయి . కానీ టిడిపి తో పొత్తు పెట్టుకున్నందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నాయుడు కు అంతా ఓకే ఓకే గా ఉంటుంది . కానీ మధ్యలో లోకేష్ బాబు పరిస్థితి ఎటు కాకుండా మిగిలిపోయింది .
నిజానికి చంద్రబాబు నాయుడు బయట ఉంటే తన కొడుకుని ఏదో ఒక మాయ చేసి ప్రజలకు దగ్గర ఓట్లు వేయించుకొని ఆయనకున్న టాలెంట్ ఎక్స్పీరియన్స్ మొత్తం రంగరించి అధికారంలోకి వచ్చేవాడూ. ఆ ఛాన్సెస్ ఎక్కువగా ఉండేటివి. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆయన జైల్లో ఉన్నాడు .. ఆయన కి తెలివితేటలు ఉన్న అది ఇంప్లిమెంట్ చేయడానికి స్కోప్ లేదు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఆడ్ అయితే పవన్ కళ్యాణ్ కున్న టాలెంట్ కి ఆయనకున్న తెలివికి టిడిపి పరువు పోగొట్టుకోకుండా ఉండే పరిస్థితి వస్తుంది అని ఫిక్స్ అయిపోయాడు చంద్రబాబు . అందుకే పవన్ కళ్యాణ్ తో చేతులు కలపడానికి ముందు నుంచి ఇంట్రెస్ట్ గానే ఉన్నాడు.
కొద్దిసేపటి క్రితం జరిగిన ప్రెస్ మీట్ లో సైతం పవన్ కళ్యాణ్ ధూమ్ ధామ్ అంటూ ఓ రేంజ్ లో మాట్లాడారు. పక్కనున్న బాలకృష్ణ .. ఇటు పక్కనున్న లోకేష్ సైలెంట్ గా ఉన్నారే తప్పిస్తే ఏం మాట్లాడలేదు . అంతేకాదు చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి ఆయన కోడలు బ్రాహ్మణిని పరామర్శిస్తూ చంద్రబాబు ఫ్యామిలీతో ఫోటో కూడా దిగాడు పవన్ కళ్యాణ్ . ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట ఉంటే వైరల్ గా మారింది . మధ్యలో లోకేష్ చాలా సైలెంట్గా ఏమీ చేయలేక ఉన్న పొజిషన్లో కూర్చున్నట్లు కూర్చున్నాడు. నిజానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్న పొజిషన్లో ఎన్టీఆర్ ఉన్నట్టే టిడిపి రేంజ్ పరిస్థితి వేరే లెవెల్ లో ఉండేది అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. మొత్తానికి లోకేష్ అటు మింగలేక ఇటు కక్కలేక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో అందరు చెప్పిన దానికి తలవంచుతూ ..వెళ్ళిపోతున్నాడు. ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు రా స్వామి అంటూ వ్యంగంగా కౌంటర్ చేస్తున్నారు జనాలు..!!