టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా గుంటూరు కారం . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తూ ఉండగా మరో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించబోతుంది. ఫుల్ టు ఫుల్ ఫ్యామిలీ – లవ్- ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఓ చిన్న వీడియో క్లిప్ రీసెంట్ గానే సోషల్ మీడియాలో లీకై..జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది.
కాగా మరోసారి ఈ సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధపడ్డాడు మహేష్ బాబు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . అయితే ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు సినిమాలో ఐటెం సాంగ్ చేయబోయే హీరోయిన్ పేరు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఫిలిం ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం గుంటూరు కారం సినిమాలో మొదటగా హీరోయిన్ రష్మిక మందన్నాతో ఐటమ్ సాంగ్ చేయించాలని డిసైడ్ అయ్యారట త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు.
అందుకు ఆమె కూడా ఓకే అన్నిందట . అయితే లాస్ట్ మూమెంట్లో ఆమెను తీసేస్తూ .. ఈ సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు బాలీవుడ్ బ్యూటీ నూర ఫతేహి తో హాట్ స్టెప్స్ వేయించాలని డిసైడ్ అయ్యారట. అంతేకాదు దీనికి మహేష్ బాబు సైతం ఓకే చేశారట . దీంతో తెరపై ఫస్ట్ టైం మహేష్ బాబు – నూర ఫతేహి కాంబో ని చూడబోతున్నాం . చూడాలి మరి వీళ్ల జంత ఫ్యాన్స్ ని ఎలా ఆకట్టుకుంటుందో..?