త్రివిక్రమ్- సునీల్ పెళ్లిళ్ల వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఏంటో తెలుసా..?

టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ గా పేరు పొందిన త్రివిక్రమ్ కమెడియన్గా పేరుపొందిన సునీల్ మంచి స్నేహితులను సంగతి చాలామందికి తెలిసిందే.. వీరిద్దరూ కలిసి ఇప్పటికి ఒక చిన్న ఇంటికి అద్దె కూడా కడుతున్నారని వార్తలు చాలా కాలంగా వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఎవరి కెరియర్లో వారు బిజీగా ఉన్నప్పటికీ అవకాశం వస్తే మళ్లీ సినిమా చేయాలని ఇద్దరు కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా మారగా సునీల్ మాత్రం మొదట కమెడియన్గా మారి ఆ తర్వాత హీరోగా ప్రస్తుతం విలన్ గా కూడా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు.

అయితే త్రివిక్రమ్, సునీల్ ఇండస్ట్రీలోకి రాకముందే కలిసి ఒకే రూములో ఉండేవారు.. చాలా రోజులపాటు అవకాశాల కోసం ఎన్నో స్ట్రగుల్స్ కూడా ఎదుర్కొన్నారని ఎన్నో ఇంటర్వ్యూలలో తెలియజేశారు. అయితే త్రివిక్రమ్- సునీల్ వివాహం జరిగిన తీరును చూస్తే అందరికీ ఆశ్చర్య పోవాల్సిందే అన్నట్లుగా చెప్పవచ్చు.. ఈ ఇద్దరి పెళ్లి ఒకేసారి జరగడం గమనార్హం. ఒకేరోజు కొన్ని గంటల వ్యవధిలోని వీరిద్దరి పెళ్లి జరిగినట్టుగా తెలుస్తోంది.అందుకు సంబంధించి వీరి పెళ్లినాటి ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

త్రివిక్రమ్ 2002లో అక్టోబర్ 11న సాయి సౌజన్యాన్ని వివాహం చేసుకున్నారు.. ఇక అదే రోజున సునీల్ శృతి అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరి పెళ్లికి చాలామంది సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు అప్పుడే నటుడుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న సునీల్ కామెడీ అనగా మంచి పాపులారిటీ అందుకున్నారు.. అయితే వీరిద్దరూ స్నేహితులే కాకుండా పెళ్లిల విషయంలో కూడా తమ స్నేహాన్ని చాటుకున్నారు. అయితే వీరి పెళ్లిళ్లని ఒకరు ఒకరు చూసుకోలేకపోయారని బాధ మిగిలినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.