ప్రభాస్ సలార్ సినిమాలో స్టార్ హీరోయిన్స్..!!

ప్రభాస్ గురించి ప్రభాస్ నటిస్తున్న సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రభాస్ అభిమానించే అభిమానుల సంఖ్య చాలానే ఉన్నది..పాన్ ఇండియన్ స్టార్ హీరో అయినప్పటికీ ప్రభాస్ కి సంబంధించిన సినిమాల అప్డేట్ కోసం అభిమానులు చాలా అద్భుతంగా ఎదురుచూస్తూ ఉంటారు. గతంలో విడుదలైన సలార్ సినిమా టీజర్ ప్రభాస్ క్యారెక్టర్ని జురాసిక్ పార్క్ డైనోసార్ తో కంపేర్ చేస్తూ ఒక టీజర్ ని విడుదల చేయడం జరిగింది. కేవలం టీజర్ తోనే వరల్డ్ వైడ్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది సలార్ బృందం.

Trisha Krishnan leaves Aishwarya Rai blushing at Ponniyin Selvan's  pre-release event with sweetest compliment | Entertainment News, Times Now

వాస్తవానికి సలార్ సినిమా ఈనెల 28వ తేదీన విడుదల కావలసి ఉండగా.. కొన్ని కారణాల చేత ఈ సినిమా వాయిదా పడడం జరిగింది. దీంతో ఈ చిత్రానికి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అప్పుడే ఈ సినిమా రిలీజ్ డేట్ పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది.

Salaar postponed: Hombale Films make official announcement - Hindustan Times

సలార్ సినిమా పోస్ట్ పోన్ కావడంతో అభిమానులు చాలా నిరుత్సాహంతో ఉన్నారు.. ఇప్పుడు తాజగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది. రూ .300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించినట్లు సమాచారం.. ఇందులో ఐశ్వర్యరాయ్ స్పెషల్ సాంగులో చేయబోతున్నట్లు సమాచారం.. ఐశ్వర్యారాయ్ ఒప్పుకోకపోతే హీరోయిన్ త్రిషని బరిలోకి దింపే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ విషయం పైన చిత్ర బృందం ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి.