సినిమా షూటింగ్లో రామ్ చరణ్ కు గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్ ..!!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తాజాగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. చాలామంది సెలబ్రిటీల సైతం ఇందులో నటిస్తూ ఉండడం గమనార్హం .తాజాగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రామ్ చరణ్ కు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో రామ్ చరణ్ ముఖానికి గాయమైనట్లుగా సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా రామ్ చరణ్ కు ప్రాథమిక చికిత్స కూడా అందిస్తున్నట్లు సమాచారం. వెంటనే షూటింగ్ ప్రారంభించడానికి అనుకూలంగా లేకపోవడంతో పది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ముఖానికి గాయం అవ్వడంతో విరామం ప్రకటించక తప్పలేదు దీంతో కొద్దిరోజుల పాటు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం పైన అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు.

ప్రస్తుతం శంకర్ ఇండియన్ -2 సినిమా షూటింగ్ అయిపోవడంతో రామ్ చరణ్ తో సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. సెప్టెంబర్ నెలలో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించే విధంగా ప్లాన్ చేసుకున్న ప్రస్తుతం అవన్నీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కేవలం రామ్ చరణ్ కు చిన్న గాయం అయ్యిందని దానికి మేకప్ వేసి కవర్ చేయలేరని అందులో యాక్సిడెంట్ సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి వైద్యులు రామ్ చరణ్ రెస్టు తీసుకోమని చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఈ విషయం పైన అభిమానులు చాలా ఆందోళనకు గురవుతున్నారు ఈ విషయం పైన మెగా ఫ్యామిలీ స్పందిస్తుందేమో చూడాలి మరి.