Bigg Boss 7: రతిక మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి నాగ్ సెన్సేషనల్ కామెంట్స్..!!

” బిగ్ బాస్” షో అప్పుడే మూడో వారం కూడా పూర్తయిపోయింది. తొలి రెండు వారాలు మొహమాటం ప్రదర్శించిన… మూడో వారం మాత్రం రసవత్తంగా సాగింది. గత రెండు వారాల్లో నాగార్జున హౌస్ మేట్స్‌ని ఏమీ అనలేదు… ఇప్పుడు మాత్రం మొహమాటం లేకుండా తిట్టేస్తున్నాడు. మూడో హౌస్ మేట్‌గా శోభ నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక నామినేషన్స్ లో అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెప్పిన నాగార్జున.. తన ముందే ఒక్కో వ్యక్తి వాళ్లకు అనిపించిన గేమ్ చేంజర్ ఎవరు? సేఫ్ గేమర్ ఎవరో? చెప్పాలని వాళ్లకు నాగార్జున చెప్పాడు.

ఇప్పటికే హౌస్ మేట్స్ అయినా శివాజీ, సందీప్ తప్ప అందరూ తనకు అనిపించిన వారి పేర్లు చెప్పాలని చెప్పాడు నాగార్జున. ఆ లిస్టులో ఒకొకరు ఒక్కొక్కరి పేరు చెప్పుకొచ్చారు. చివరగా నాగార్జున రతికానీ లేపి ఈ మధ్యన ఎందుకు మూడ్ ఆఫ్ గా ఉంటున్నావు ర‌తిక అని అడిగాడు. ఏం లేదు సార్ అని ముందు మొహమాటం పడిన.. తరువాత నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గుర్తుకొచ్చాడు అంటూ ఏడ్చేసింది. దానికి నాగర్జున ఎక్స్ ఇస్ పాస్ట్ ప్రజెంట్‌లో ఉండు అని చెప్పాడు. ఈవారం నువ్వసలు గేమ్ లో లేవు.

అన్నీ మర్చిపోయి హౌస్ మేట్ లా బాగా ఆడాలి అని సలహాలు ఇచ్చాడు నాగార్జున. దీనికి రతిక కూడా ఓకే సార్ ఈ సారి నుంచి బాగా ఆడుతా అంటూ చెప్పుకొచ్చింది. తన ఎక్స్ రాహుల్ గురించి మనందరికీ తెలిసిందే. తాజాగా ఈయన ఇన్‌స్టాలో ఒక పోస్ట్ కూడా చేశాడు. సింపతి వాడుకుని ఓట్లు వేపించుకుంటున్నావని వ్యాఖ్యలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.