శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో తక్కువ టైంలోనే తిరుగులేని సక్సెస్ అందుకుంది జాన్వీ కపూర్. జాన్వీ ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో సౌత్ ఇండియాలో అడుగు పెట్టబోతుంది. ఇక శ్రీదేవి తల్లి తెలుగులో సూపర్ స్టార్ గా ఎదిగారు. ఆమె కూతురుకు దేవర తెలుగులో తొలి సినిమా అవుతుండడంతో శ్రీదేవి అభిమానులు కూడా జాన్వీ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
అందులోను యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడిగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తుండడంతో ఈ సినిమా హిట్ అయితే సౌత్ లో జాన్వీ కొన్ని ఏళ్లపాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని కూడా ఉండదు. ఇదిలా ఉంటే దేవర కంటే ముందే తెలుగులో జాన్వీకపూర్ ఒక సినిమాలో నటించాల్సి ఉంది. అయితే అంది వచ్చిన అవకాశాన్ని ఆమె వదులుకున్నారు.
ఆ సినిమా ఏదో కాదు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. ఈ సినిమాలో అఖిల్- పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో ముందుగా జాన్వీకపూర్ కి హీరోయిన్గా అవకాశం వచ్చినా బోనికపూర్ ఈ సినిమాలో తన కుమార్తె నటించడానికి ఇష్టపడలేదట. అప్పటివరకు వరుస ప్లాపులతో సతమతమవుతున్న అఖిల్ సినిమాపై ఏ మాత్రం నమ్మకం లేకపోవడంతోనే బోనికపూర్ ఈ సినిమాలో జాన్వీ నటించదని చెప్పేశారు.
జాన్వీ తప్పుకోవడంతో ఈ క్రేజీ ప్రాజెక్టులో పూజ హెగ్డే హీరోయిన్గా భాగం అయ్యారు. విచిత్రం ఏంటంటే ఈ సినిమా అఖిల్‌కు కెరీర్ పరంగా తొలి హిట్ గా నిలిచింది. ఆ తర్వాత అఖిల్ నటించిన ఏజెంట్ మళ్ళీ డిజాస్టర్ అయ్యింది. ఇక రామ్ చరణ్- బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలోను జాన్వీకపూర్ పేరు హీరోయిన్ గా వినిపిస్తోంది.