సినిమాలకు దూరంగా ఉన్న నివేద థామస్.. కారణం తెలిస్తే షాక్..!!

టాలీవుడ్లో హీరోయిన్గా పేరుపొందిన నివేద థామస్ ఎలాంటి పాత్రలోనైనా సరే మరి ఒదిగిపోయి నటిస్తూ ఉంటుంది.. మొదట నాని నటించిన జెంటిల్మెన్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత వరస సినిమాలలో చేసి బిజీ హీరోయిన్గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.. తెలుగు, తమిళ్, మలయాళ భాషలతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించింది నివేదా థామస్ అయితే అనుకోని విధంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

Nivetha Thomas explains her birthday mood in new monochrome pics | Telugu  Movie News - Times of India

చివరిగా 2022లో షాకిని డాకిని అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో తప్ప పెద్దగా ఎక్కడ కనిపించలేదు. అయితే అందుకు కారణం ఏంటనే విషయం తెలియదు కానీ ఈమె గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది.. నివేద థామస్ కాస్త బరువు పెరగడం వలన సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిందని ఆమె బరువు తగ్గి మళ్ళి కనిపించడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది అనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా ఆమె తరచుగా కనిపించలేదు అందుకు కారణం ఆమె బరువు పెరగడమే అన్నట్టుగా సమాచారం.

What's Up: Nivetha Thomas, Regina Cassandra after NTR | cinejosh.com

ప్రస్తుతం నివేద థామస్ ఎక్కడ ఉంది అనే విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు కానీ ఆమె బరువు తగ్గడానికి వెళ్ళింది అనే విషయం మాత్రం వైరల్ గా మారుతోంది. దీంతో పలువురు అభిమానులు ఆమె అప్డేట్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు పలు రకాల కామెంట్లు కూడా షేర్ చేస్తే ఆమె పేరుని వైరల్ గా చేస్తున్నారు. మరి నివేద థామస్ ఈ విషయం పైన స్పందిస్తుందేమో చూడాలి మరి.