50 మిలియన్ వ్యూస్‌తో అద‌ర‌కొట్టిన‌ ” స్కంద ” టైల‌ర్‌..!!

యువ నటుడు రామ్ పోతినేని హీరోగా – శ్రీ లీల హీరోయిన్గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో… శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై అత్యంత భారీ స్థాయిలో రూపొందిన‌ పాన్ ఇండియా సినిమా స్కంద. భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న స్కంద పై రామ్ ఫాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ తో పాటు టీజర్, ట్రైలర్ అన్ని ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుని మూవీపై ఉన్న అంచనాలను మరింత పెంచేశాయి.

అసలు విషయం ఏమిటంటే.. తాజాగా రిలీజ్ అయిన స్కంద థియేట్రికల్ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో 50 మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు ముగించి సెప్టెంబర్ 28న పలు భాషల్లో ఆడియన్స్ ముందుకి రానుంది.ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న శ్రీ లీలకు టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పావసరం లేదు.

ఆమె కాల్షీట్ల కోసం దర్శక దీరులు క్యూ కడుతున్నారు. యంగ్ హీరోలు తమ సినిమాలకు మొదట పేరు శ్రీ లీలదే చెబుతున్నారు. దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందడి చిత్రంతో తెలుగు సిని పరిశ్రమలో అడుగుపెట్టింది శ్రీలీల. రవితేజ ధమాకా చిత్రంతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇలా ఇండస్ట్రీలోకి రావడమే ఆలస్యం పదికి పైగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఆ పది సినిమాల్లో స్కంద ఒకటి.