మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా శ్రీ‌లీలా.. య‌మా బిజీ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్న స్టార్ హీరోయిని ఎవరూ అంటే టక్కున గుర్తుకు వచ్చేది శ్రీ లీల. ప్రస్తుతం వస్తున్న అన్ని సినిమాలు ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నాయి. అందులోను స్టార్ హీరోల సినిమాల్లో శ్రీ లీల ఎక్కువగా నటిస్తుంది. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మోస్ట్ పాపులర్ హీరోయిన్గా వ‌రుస‌ సినిమాలను లైన్లో పెట్టుకుంది. ప్రస్తుతం రామ్‌ పోతినేని హీరోగా తెరకెక్కిన స్కంద సినిమాలో హీరోయిన్గా నటించింది. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 28 ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. అలాగే నందమూరి నట‌సింహ బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్‌ కేసరి సినిమాలో కాజల్ కథానాయకగా, శ్రీ లీల కీలక పాత్రలో నటిస్తున్నారు.

అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఆది కేశవ.. వైష్ణవ తేజ్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది.నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా చాలాసార్లు వాయిదా పడింది. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్.. నితిన్ హీరోగా వక్కంతం వంశీ ఈ సినిమాను రూపొందించాడు. ఇందులో శ్రీ లీల జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తుంది. గుంటూరు కారం మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీలీల కథానాయకులుగా కనిపిస్తారు. VD12 విజయ్ దేవరకొండ – గౌతమ్ తిననూరు కాంబినేషన్లో వస్తున్న సినిమాకు శ్రీ లీల హీరోయిన్గా ఫిక్స్ అయింది. ఈ సినిమాలో విజయ్ పోలీస్ గా కనిపించబోతున్నాడు.

ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్.. పవన్ కళ్యాణ్ హరిశంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా కనిపించబోతుంది మరో హీరోయిన్గా సాక్షి వైద్య నటిస్తుంది. అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి హీరోగా కొన్ని నెలల క్రితం ప్రారంభమైన సినిమా ఇది. ఇందులో కూడా శ్రీ‌లీల హీరోయిన్గా నటిస్తుంది. కాకపోతే ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. జూనియర్.. రాజకీయ నేత గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి కీరోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల నటిస్తుంది. ప్రస్తుతం శ్రీ లీల ఈ సినిమాలో ఉంది. ఇవేకాక చిరంజీవి 156, రామ్ చరణ్ సినిమా, నితిన్ – వెంకీ కుడుముల కాంబినేషన్లో రాబోతున్న సినిమాల్లో కూడా ఈ బ్యూటీని తీసుకోవాలని చర్చలు నడుస్తున్నాయి.