ఎన్టీఆర్ కు తలనొప్పిగా మారిన చంద్రబాబు అరెస్ట్..!!

స్కిల్ డెవలప్మెంట్ పేరుతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ స్కాం కి పాల్పడ్డారంటూ ఆంధ్ర ప్రదేశ్ సిఐడి అధికారులు ఆయనని అరెస్టు చేయడం జరిగింది.. దీనికి టిడిపి అభిమానులు నాయకులు సైతం నిరసనలు తెలుపుతున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు బాలయ్య,రామకృష్ణ పురందేశ్వరి సైతం ఈ విషయాన్ని తప్పు పట్టారు. అలాగే ఆంధ్రప్రదేశ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ అరెస్టు ను ఖండిస్తూ నిరసన చేస్తూ ఉన్నారు.

చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన కొద్దిసేపటికి సోషల్ మీడియాలో ఒక విషయం చాలా వైరల్ గా మారింది.. అదేమిటంటే వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయాన్ని ఖండించాలి అంటూ టిడిపి వర్గాల నుంచి చర్చలు మొదలయ్యాయి.. ఎన్టీఆర్ నుండి ఎలాంటి ప్రకటన ఇప్పటివరకు రాలేదు. దీంతో ఎప్పటిలాగే ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ ఉన్నారు పలువురు నెట్టిజెన్స్.. అతడు నందమూరి హీరో కాదు అవసరం తీరాక ఎదుగుదలకు కారణమైన వాళ్ళని వదిలేశారు అంటూ కూడా ఎన్టీఆర్ పైన దారుణమైన కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

గతంలో కూడా చంద్రబాబు సతీమణి పైన కూడా పలు కామెంట్స్ చేయగా వీటి పైన కూడా ఎన్టీఆర్ స్పందించిన తీరు బాగాలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టిడిపి నాయకులు ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ అని నాన్న రకాలుగా అంటున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనక పోవడం కూడా ఆయన మీద వ్యతిరేకతకు కారణమవుతోంది. టిడిపి పార్టీ ఆది నాయకత్వ విషయంలో కూడా ఎప్పటికైనా ఎన్టీఆర్ పోటీ వస్తాడని బాబు వర్గాల నుంచి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

అందుచేతనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి చంద్రబాబుకు వ్యతిరేకత ఎప్పుడు ఎదురవుతూనే ఉంటుంది. టిడిపి క్యాడర్లో లోకేష్ అంటే నచ్చని వారు కూడా ఉన్నారని ఎన్టీఆర్ ని మాత్రమే సమర్థిస్తూ చాలామంది ఉన్నారని సమాచారం. దీంతో టీడీపీ కేంద్రంగా జరుగుతున్న ఇలాంటి పరిణామాలు ఎన్టీఆర్కు తలనొప్పి తెచ్చేలా కనిపిస్తున్నాయి.