మార్బుల్ స్టోన్ పై షారుక్‌ చిత్రం.. ఆర్టిస్ట్ పై ప్రశంసల వర్షం..

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ అభిమానులు దేశవ్యాప్తంగా ఉన్నారు. అతడి కోసం ప్రాణాలైనా ఇచ్చే అభిమానులు కోట్లలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన అభిమాని ఆర్టిస్ట్ ప్రీతమ్ బెనర్జీ షారూఖ్ పై ఉన్న అభిమానంతో చిన్న మార్బుల్ స్టోన్స్ తో నల్లని క్యాన్వాస్ మీద 30 అడుగుల పరిమాణంతో ఓ ఇంటి స్లాబ్ పై షారూఖ్ భారీ చిత్రాన్ని వేశాడు.

అందుకు సంబంధించి వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. నెటిజెన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సందర్భంగా ప్రీతమ్ మాట్లాడుతూ..” ఈ చిత్రం నా గుండెల్లోంచి వచ్చింది. షారూఖ్ ను నేను అభిమానించే కళ కన్నా ఎక్కువగా ప్రేమిస్తాను. ఆయన కూడా ఈ చిత్రాన్ని చూస్తారని ఆశిస్తున్న ” అని తెలిపాడు.

ప్రీతమ్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షారూఖ్ కు సరైన ట్రిబ్యూట్ ఇచ్చావ్ అంటూ కొందరు ప్రేక్షకులు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు ఓ మై గాడ్.. అమేజింగ్ అంటూ ప్రీతమ్ ని పొగుడుతున్నారు. ఇక ఈ చిత్రం షారుక్ వ‌ర‌కు వెళ్ళాల‌ని ప్రీత‌మ్‌తో పాటు షారుక్ ఫ్యాన్స్ అంత కోరుకుంటున్నారు. ఈ వీడియోని వైర‌ల్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Pritam Banerjee (@bongpicasso)