మెగా 156 చిత్రంతోనైనా ఈ స్టార్ హీరోయిన్ కెరియర్ మారెనా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. అయితే చిరంజీవికి హీరోయిన్లు సెట్ అవ్వడం చాలా ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది.. ఇప్పటికే కాజల్ అగర్వాల్ ,తమన్నా ,నయనతార వంటి హీరోయిన్స్ సైతం చిరంజీవితో జతకట్టారు. అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళని రిపీట్ చేయలేని పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది.. ఒకవేళ చిరంజీవి కొత్త హీరోయిన్ ని తీసుకోవాలనుకుంటే ఆయనకి వయసు అడ్డంటి గా మారుతోంది. మరి కొంతమంది హీరోయిన్లు వయసున్న హీరోలకు చెల్లెలుగా నటిస్తూ ఉన్నారు.

Chiranjeevi Is Glad On Son Ram Charan Welcoming A Baby Girl: "Tuesday Is An  Auspicious Day For Anjaneya Swamy..."

ఈ నేపథ్యంలోని చిరంజీవి 156..157 వంటి చిత్రాలలో హీరోయిన్ల ఎంపిక చాలా కష్టమవుతుంది.. 157 వ చిత్రానికి సైతం అనుష్క, నయనతారని పరిశీలిస్తున్నట్లు సమాచారం. 156వ చిత్రానికి హీరోయిన్ పరిస్థితి ఏంటి అనే విషయం తాజాగా వైరల్ గా మారుతోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరు ఏంటని విషయం మాత్రం ఇంకా బయటికి రాలేదు. ఈ చిత్రానికి నిర్మాతగా మాత్రం చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో చిరంజీవికి జోడిగా రకుల్ ప్రీతిసింగ్ దించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Rakul Entry for Ram Charan! | cinejosh.com

ఈ ప్లాన్ అంతా రామ్ చరణ్ తే అన్నట్టుగా సమాచారం. రకుల్ ప్రీతిసింగ్ గతంలో కూడా చాలా సినిమాలలో నటించింది. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరి నటిస్తూ ఉంటుంది. అంతేకాకుండా రామ్ చరణ్ కి మంచి స్నేహితురాలు కూడా గతంలో ధ్రువ ,బ్రూస్లీ వంటి సినిమాలలో నటించడం జరిగింది. అప్పటినుంచి వీరిద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడిందట. ఈ విషయం రకుల్ ప్రీతిసింగ్ కి చెప్పగానే ఓకే చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రకుల్ ప్రీతిసింగ్ కూడా తెలుగు తెరకు ఎంట్రీ ఇవ్వాలని పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నది కనుక మరి ఈ ఎంట్రీ తో రకుల్ ప్రీతిసింగ్ సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి.