లారెన్స్‌ ” జిగర్ తండ డబుల్ X “.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

ఎస్ జె సూర్య, రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ” జిగర్ తండ డబుల్ ఎక్స్ ” గ్యాంగ్ స్టార్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించంది.

ఇక ఈ ఏడాది నవంబర్లో దీపావళి కానుకగా ఈ మూవీని విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు మూవీ టీమ్‌. అయితే ఈ సినిమా తెలుగులోనూ విడుదల కానుండుగా.. టీజర్ ను ఈనెల 11న మ. 12:12 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం తాజాగా ప్రకటించింది.

స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇప్ప‌టికే మంచి అంచ‌నాలు తెచ్చుకున్నఈ మూవీ రిలీజై ప్రేక్ష‌కుల‌లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.