ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోవాలి”.. స్టేజీ పైనే విజయ్ సంచలన కామెంట్స్..!!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అంటేనే డేరింగ్ . ఆయన దమ్ముకి .. ఆయన కాన్ఫిడెన్స్ కి ..మరి ఏ హీరో సాటిరారు అని చెప్పాలి. స్టేజిపై ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే నిర్మొహమాటంగా ఆన్సర్ ఇచ్చే విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తర్వాతే ఇలా తయారయ్యారు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి . ఏది ఏమైనా సరే విజయ్ దేవరకొండ ఈ రేంజ్ లో మాట్లాడడం వల్లే ఆయనకు హ్యూజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది అన్నది మాత్రం వాస్తవం .

రీసెంట్గా ఆయన నటించిన సినిమా ఖుషి . శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ ఒకటిన గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెన్నై ప్రసాద్ ల్యాబ్ లో ప్రెస్ మీట్ అరేంజ్ చేసిన ఖుషి టీమ్ ..మీడియా రిపోర్టర్స్ తో ముచ్చట్టించారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న అనిరుధ్ గురించి ఓ రేంజ్ లో పొగిడేసారు విజయ్.

ఇంత చిన్న ఏజ్ లోనే ఈ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడం చాలా గర్వకారణం అని ..ఆయన క్రేజ్ చూస్తుంటే ముచ్చటేస్తుందని ..జాతీయస్థాయిలో ఇలాంటి క్త్రేజ్ సంపాదించుకున్న అనిరుధ్ ని కిడ్నాప్ చేయాలని ఉందని చెప్పుకొచ్చారు . దీంతో ఆయన మాటలు వైరల్ గా మారాయి . అంత పెద్ద స్టార్ హీరో అనిరుధ్ పై ఇలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుంది..!!