పాలిటిక్స్‌లో గెలుపు ప‌క్కా…. ర‌వితేజ ‘ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ‘ టీజ‌ర్

మాస్ హీరో రవితేజ తాజాగా నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు..ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరి దృష్టి కూడా ఈ సినిమా పైనే ఉంది.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వంశీ ఇప్పటివరకు టచ్ చేయని కాన్సెప్ట్ టచ్ చేస్తున్నారని చెప్పవచ్చు.. రవితేజ అతడి నమ్మకం మీదే ఉంచి ఈ సినిమాలో నటిస్తూ ఉన్నారు.. టైగర్ నాగేశ్వరరావు పాత్రను ఊహించని స్థాయిలోనే ప్రజెంట్ చేయడానికి చిత్ర బృందం చాలానే కష్టపడుతోంది..

స్టువర్టపురం గజదొంగగా ఒకప్పుడు పోలీసులను చాలా ముప్పు తిప్పలు పెట్టిన టైగర్ నాగేశ్వరరావు గురించి అందరికీ తెలిసిందే.. అయితే అతని కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఇది వరకే పలు రకాల ఫస్ట్ లుక్ పోస్టర్లను సైతం విడుదల చేయగా ఇప్పుడు ఏకంగా టీజర్ ని సైతం ప్రజెంటేషన్ చేసిన విధానం కూడా అందరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. టైగర్ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ చాలా పవర్ ఫుల్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

అయితే ఇప్పటి వరకు ఏ సౌత్ దొంగ కూడా ఈ జైలు నుంచి తప్పించుకోవడానికి లేదని పోలీస్ చెప్పడం ఆ తర్వాత మురళి శర్మ ఎంట్రీ అవ్వడంతో టైగర్ జోన్ లోకి ప్రవేశించాలని చెప్పడంతో రవితేజ పాత్ర ఎంట్రీ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే పొలిటికల్ టచ్ కూడా ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తోంది. టైగర్ నాగేశ్వరరావు యాక్షన్ ఎలివేన్స్ కూడా అందర్నీ స్టన్ అయ్యేలా చేస్తున్నాయి మొత్తానికి ఈ టీజర్ పైన భారీగా అంచనాలు పెంచేసాయి. ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన విడుదల కాబోతోంది.