ర‌జ‌నీకాంత్‌కు అనిరుధ్ ఏమ‌వుతాడో తెలుసా… న‌య‌న్ భ‌ర్త చెప్పిన నిజం…!

ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన సృష్టించింది. భారీ కలెక్షన్ల వసూళ్లతో అదరపడుతున్న జైలర్ మూవీకి.. టైగర్‌కా హుకుమ్‌ సాంగ్ తో యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అవ‌దించిన మ్యూజిక్, బిజిఎం ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక జైలర్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో అనిరుధ్ లైవ్ మ్యూజిక్ కాన్సెప్ట్ ఈ ఈవెంట్‌కే హైలెట్గా నిలిచింది. ఈ ఈవెంట్లో నయనతార భర్త విఘ్నేష్ శివ‌న్‌ మాట్లాడుతూ అనిరుధ్ – రజనీకాంత్ బంధం గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

విజ్ఞేష్‌ మాట్లాడుతూ కొంతమంది జీవితంలో ఇలాంటి క్షణం వస్తే బాగుండు అని ఎదురు చూస్తారు. నేను తలైవ ముందు నిలబడిన ఈ క్షణం కూడా అలాంటిదే.. జైలర్‌లో తండ్రి ,కొడుకులు అనుబంధం గురించి నేను పాట రాశాను. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఇద్దరు పిల్లలకు తండ్రిని భవిష్యత్తులో వాళ్ళు పెద్దయ్యాక నేను రాసిన పాట రజిని సినిమాలో ఉందని గర్వంగా చెప్పుకుంటాను ఇక రజనీ సార్ కోసం నేను ఆ పాట తయారు చేసినప్పుడు అనిరుధ్‌లో నిజాయితీ, ప్రేమ కనిపించాయి.

రజనీ సార్ కి ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు. ఆయనకు కొడుకు లేడని సమస్య అనిరుధ్‌లో తీరిపోయింది. ఎందుకంటే తలైవా పట్ల అతనికి ఉన్న అభిమానం, ప్రేమను చూస్తే ఒకవేళ రజినీకి కొడుకు ఉన్న వీరిద్దరి బంధాన్ని చూసి అసూయపడేవాడేమో అన్న విధంగా కనిపిస్తారు అన్నాడు విగ్నేష్. ఇక ప్రస్తుతం జైలర్ సినిమాతో కోలీవుడ్ నెంబర్వన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏఆర్ రెహమాన్‌ను మించి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అంటే అతని క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఆడియో లాంచ్ ఫంక్షన్ లో అనిరుధ్ వ‌చినప్పుడు సూపర్ స్టార్ రజిని అతని కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైర‌ల్‌ అవుతుంది. అనిరుద్ తమిళ నటుడు రవి రాఘవేంద్ర కొడుకు అన్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ కు అతడు చాలా దగ్గర బంధువు. తలైవా భార్య లతా రజినీకి మేనల్లుడు అవుతాడు. అందుకే రజనీకి.. అనిరుధ్‌ అంటే ప్రత్యేక అభిమానం. సుమారు 30 ఏళ్ల క్రితం రజనీకాంత్ ఓ షూటింగ్లో ఉండగా అతని భార్య లత అనిరుధ్‌ని తీసుకొని షూటింగ్ కి వెళ్ళారట. ఆ టైంలో రజిని అనిరుధ్‌ ఫోటో దిగారు. ఇప్పుడు ఇదే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.