పాపులారిటీ పెంచుకునే పనిలో మృణాల్ థాకూర్…కొత్త ఫోటో షూట్ తో గ్లామర్ ట్రీట్..

ప్రస్తుతం తెలుగు లో తన స్థానాన్ని పదిలం చేసుకునే పనిలో ఉంది అందాలభామ మృణాల్ థాకూర్. హను రాగహవపుడి దర్శకత్వంలో వచ్చిన సీత రామం చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముంబై భామ ప్రస్తుతం నాని తో కలసి “హాయ్ నాన్న!” చిత్రంలో నటిస్తోంది. గత ఏడాది విడుదలైన సీత రామం మంచి విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులని కాకుండా క్రిటిక్స్ ని కూడా మెప్పించి 2022లో వన్ అఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ గా నిలిచింది. సీతామహాలక్ష్మి గా ఈ సినిమాలో మృణాల్ పాత్ర ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు ఈ అమ్మడు తెలుగులో వరుస అవకాశాలను కొట్టేస్తోంది.

ప్రస్తుతం మృణాల్ నటిస్తున్న హాయ్ నాన్న చిత్రం ఈ ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా విడుదలైన టీజర్లో మృణాల్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబోలో తెరకెక్కబోతున్న చిత్రంలో కూడా మృణాల్ నటిస్తోంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్నఈ చిత్రం షూటింగ్ కూడా మొదలయింది. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతోందని సమాచారం.

ప్రస్తుతం వరుస అవకాశాలతో మంచి ఫామ్ లో ఉన్న మృణాల్, తన కెరీర్ మొదటిలో అనేక అవమానాలను ఎదుర్కున్నారట. ఆమె సీరియల్ బాక్గ్రౌండ్ తో సినిమాలలోకి అడుగుపెట్టారు. సీరియల్ నటి అనగానే తక్కువగా చూసేవారట అందరు. మట్కా అనే నిక్ నామ కూడా పెట్టారట. ఇలాంటి అవమానాలన్నీ తట్టుకొని ఈ స్థాయికి వచ్చానని చెప్తుంటుంది మృణాల్. గతంలో ఎన్ని జరిగిన ప్రస్తుతం మృణాల్ సినీ కెరీర్ మాత్రం మూడు పువ్వులు ఆరు కాయలు గా బాగానే సాగుతోంది. మంచి హిట్ తో తెలుగులో అడుగుపెట్టిన మృణాల్ థాకూర్ ప్రస్తుతం తన పాపులారిటీని పెంచుకోవడానికి గ్లామరస్ ఫోటో షూట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తన ఫొటోలనో సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. తాజాగా ఆమె చేసిన ఒక ఫోటో షూట్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుబుసం వంటి డ్రెస్ లో ఆమె దిగిన ఫోటోలు కుర్రాళ్ళ మతులు పోగొడుతున్నాయి.