టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నాని ప్రెసెంట్ ఎలాంటి స్థానంలో ఉన్నారో మనకు బాగా తెలిసిందే . కాగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎటువంటి హెల్ప్ లేకుండా వచ్చిన నాని కెరియర్ స్టార్టింగ్ లో రేడియో జాకీగా పని చేశారు.. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు ..ఆ తర్వాత హీరోగా తన లక్ ని పరీక్షించుకొని స్టార్ హీరోగా మారాడు .
ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు తీస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు . అయితే నాని అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసే టైంలో మహేష్ బాబు ని డైరెక్ట్ చేశాడు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది , మహేష్ బాబు కెరీర్ లోనే పరమ చెత్త సినిమాగా నిలిచిన అర్జున్ సినిమాకు నాని అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారట . ఈ సినిమాకి డైరెక్టర్ గుణశేఖర్ .
అర్జున్ సినిమా చేస్తున్న టైంలో గుణ శేఖర్ వద్ద నాని అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారట. ఇదే క్రమంలో ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ఆయన డైరెక్ట్ గా డైరెక్షన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా ఎంత పరమ చెత్త టాక్ అందుకుందో మనకు తెలిసిందే. సిస్టర్ సెంటిమెంట్ అయినప్పటికీ సినిమాలో ఏదో మిస్ అయింది అన్న కామెంట్స్ వినిపించాయి . అయితే నమ్రత కి మాత్రం మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమా చాలా చాలా నచ్చుతుందట . చాలా కూల్ ..స్టైల్ లుక్స్ ఉంటాయి అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది . ప్రజెంట్ ఇదే న్యూస్ ట్రెండ్ అవుతుంది..!!