ప్రభాస్‌-స‌మంత కాంబోలో ఇంతవ‌ర‌కు ఒక్క సినిమా కూడా రాక‌పోవ‌డానికి కార‌ణం ఏంటో తెలుసా?

బాహుబ‌లి సినిమాతో టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కాస్త పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. నేష‌న‌ల్ వైడ్ గా విప‌రీత‌మైన క్రేజ్ తో పాటు అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా భారీ ప్రాజెక్ట్ లు టేక‌ప్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక‌పోతే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా ముద్ర వేయించుకున్న వారంద‌రూ ప్ర‌భాస్ తో జ‌త‌కట్టారు.

కానీ, సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత మాత్రం ప్ర‌భాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోలేక‌పోయింది. ఇంత‌వ‌రకు వీరి క‌ల‌యిక‌తో ఒక్క‌టంటే ఒక్క సినిమా కూడా రాలేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం హైట్‌. స‌మంత ఎత్తు 5.2 అయితే.. ప్ర‌భాస్ హైట్ ఏకంగా 6.2. అబ్బాయి ఫ‌స్ట్ ఫ్లోర్ లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఎట్టా వ‌ర్కోట్ అవుద్ది అని మిర్చి మూవీలో అనుష్క అన్న‌ట్లు.. ప్ర‌భాస్ ఫ‌స్ట్ ఫ్లోర్ లో, స‌మంత గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే చూసే ప్రేక్ష‌కులు చాలా అసౌక‌ర్యంగా ఫీల్ అవుతారు.

అందుకే త‌న సినిమాల‌కు హీరోయిన్ గా స‌మంత పేరు తెర‌పైకి వ‌చ్చిన ప్ర‌తిసారి ప్ర‌భాస్ ముందే ఆమె వ‌ద్ద‌ని చెప్పేస్తాడ‌ట‌. అందుకే ఇంత వ‌ర‌కు స‌మంత‌, ప్ర‌భాస్ కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేద‌ట‌. కాగా, ప్రస్తుతం ప్రభాస్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌శాంత్ నీల్ తో స‌లార్‌, నాగ్ అశ్విన్ తో క‌ల్కి, మారుతి డైరెక్ష‌న్ లో రాజా డీల‌క్స్ చిత్రాలను ప్ర‌భాస్ ప‌ట్టాలెక్కించాడు. వీటిలో స‌లార్ రెండు భాగాలుగా రాబోతోంది. ఫ‌స్ట్ పార్ట్ ను వ‌చ్చే నెల‌లో విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.