శ్రీలీల ని రిజెక్ట్ చేసిన ఫస్ట్ హీరో ఇతనే.. తెలుగోడి దెబ్బ అదుర్స్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే యంగ్ హీరోయిన్స్ శ్రీలీల పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . అది టాలీవుడ్ కాదు శాండిల్ వుడ్ కాదు.. శ్రీలీల జపం చేస్తున్నారు అందరు హీరోలు. మరీ ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఈ అమ్మడుకు బడా బడా ఆఫర్లు వస్తూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇలాంటి క్రమంలోనే మన తెలుగు హీరో శ్రీ లీలను రిజెక్ట్ చేశారు .

డైరెక్టర్ ఏది కోరి హీరోయిన్ గా తమ సినిమాలో పెట్టుకుందాం అని తెలిసిన తెలుగు హీరో మాత్రం వద్దనే వద్దు అంటూ చేతులెత్తేసాడు . ఇంతకీ ఆ హీరో ఎవరో అనుకుంటున్నారా ..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ . ఎస్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ శ్రీ లీలను రిజెక్ట్ చేశాడు. వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న శ్రీలీలను రిజెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఆమె హైట్ అంటూ తెలుస్తుంది.

ప్రభాస్ ప్రెసెంట్ మారుతీ దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే మొదటిగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా శ్రీలీలను అనుకున్నారట మారుతి . అయితే ప్రభాస్ మాత్రం వద్దనే వద్దు అంటూ చాలా తక్కువ హైట్ ఉంది.. క్రేజ్ ఉన్నా సరే తెరపై జంట చూడముచ్చటగా లేకపోతే అభిమానులు యాక్సెప్ట్ చేయరు.. అంటూ శ్రీ లీలను ఈ సినిమా నుంచి తీసేసారట. దీంతో అందరి హీరోలు శ్రీలీల వెంటపడుతుంటే ప్రభాస్ ఒక్కడే ఆమెను రిజెక్ట్ చేశాడు అన్న వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!