మరో వివాదంలో సింగర్ చిన్మయి.. ట్రోల్స్ చేస్తూ ఫైర్ అవుతున్న నెటిజన్స్..!

సింగర్ చిన్మయి ఎప్పటికప్పుడు ఏవో ఒక కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఒక వివాదం ముగిసేటప్పటికీ మరో వివాదంలో చిక్కుకుంటు వార్తల్లో నిలిచే చిన్మయి తాజాగా మరో కాంట్రవర్షియల్ కమెంట్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతూ ఉంది. ఎప్పుడు మహిళలపై జరిగే అరాచకాలపై స్పందిస్తూ ఆమె సపోర్ట్ ను అందించే చిన్మయి ఇటీవల కెన‌డాకి చెందిన‌ ఎన్ఆర్ఐ మహిళకు సపోర్ట్ గా మాట్లాడుతూ ఆమె చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీంతో ఆమెపై చాలామంది నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇటీవల కెన‌డ‌ ఎన్ఆర్ఐ యువ‌తికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది చిన్మయి. అందులో భాగంగా ప్రశ్నిస్తూ మీరు ఇండియాను వదిలి ఎందుకు కెనడా వచ్చి స్థిరపడ్డారు అని ఆమెని చిన్మయి అడిగింది. ఆమె స్పందిస్తూ ఇండియను విడిచిపెట్టి రావడమే నా డ్రీమ్ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. కెనడాలో మీకు ఏం నచ్చింది అని అడగగా నాకు ఇక్కడ ఫ్రీడమ్ ఉంది అంటూ ఆమె సమాధానం ఇచ్చింది.

ఈ వీడియోపై చిన్మయి స్పందిస్తూ పరాయి దేశంలో కూడా ఆమె స్వేచ్ఛగా బతకగలుగుతుంది.. ఆమె చెప్పింది ఏంటో అర్థం అయ్యిందా.. ఆమె ఇండియా విడిచి వెళ్లినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా దేశంలో మహిళలందరూ సురక్షితమైన ప్రదేశాలకు వెళ్తే ఎంత బాగుంటుందో అంటూ ట్విట్ చేసింది. దీంతో చాలామంది చిన్మయిపై ఫైర్ అవుతున్నారు. ఇండియాలో ఎంతోమంది ఆడవారు స్వేచ్ఛగా బతుకుతూ తమకు నచ్చిన జీవితాన్ని గడుపుతున్నారు. ఇక్కడ స్వేచ్ఛ లేదని జడ్జ్ చేసే రైట్స్ నీకు లేవు. సొంత దేశాన్ని తక్కువగా మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అంటూ తిట్టిపోస్తున్నారు