తెలుగు ఇండస్ట్రీకి మరో రౌడి హీరో దొరికేసాడోచ్.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి ఎక్కడో కాలిపోతున్నట్లుందిగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరో అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు విజయ్ దేవరకొండ . పెళ్లి చూపులు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన ఈ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో టాప్ రేంజ్ లో ఎదిగిపోయాడు. ఇప్పటికి అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయి కొన్ని సంవత్సరాలు కావస్తున్న ఇంకా అర్జున్ రెడ్డి ఫేమ్ తోనే సక్సెస్ సాధిస్తున్నాడు . అలాంటి అవకాశాలు అందుకుంటున్నాడు విజయ్ దేవరకొండ . అయితే ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ లాంటి హీరో ఇప్పటివరకు ఎవరూ లేరనే చెప్పాలి .

. అయితే తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ వైరల్ చేస్తూ ఇండస్ట్రీకి మరో విజయ్ దేవరకొండ దొరికాడు అంటూ ట్రెండ్ చేస్తున్నారు కొందరు జనాలు ఆ ఫొటోస్ మరెవరివో కాదు రీసెంట్గా బేబీ సినిమాతో హిట్టు అందుకున్న వైష్ణవి చైతన్య బ్రదర్. బేబీ సినిమా ప్రమోషన్ టైంలో వైష్ణవి చైతన్య దేవరకొండ ని మీట్ అయింది . అదే టైంలో వైష్ణవి చైతన్య బ్రదర్ కూడా విజయ్ దేవరకొండ తో మీట్ అయ్యాడు .

ఈ క్రమంలోనే ఎవరైనా సరే అంత పెద్ద స్టార్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా హుందాగా బిహేవ్ చేయాలి. కానీ ఇతగాడు మాత్రం అర్జున్ రెడ్డి లాగే హెడ్వైట్ గా బిహేవ్ చేశాడు. ఏకంగా ఆయన పై చేయి వేసి మరి ఫోటోకి ఫోజులిచ్చాడు. దీంతో ఈ ఫోటోలు చూసినా ఎవరైనా సరే విజయ్ దేవరకొండ అతనితో ఫోటో దిగాడే కానీ అతను విజయ్ దేవరకొండ తో ఫోటో దిగాడు అని అనుకోరు అంటూ కామెంట్స్ చేస్తుంటే .. మరికొందరు ముందు పద్ధతులు నేర్చుకో బాసూ అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు ఇండస్ట్రీకి దొరికిన మరో రౌడీ హీరో ఇతను అంటూ ట్యాగ్ చేస్తూ ఉండడంతో ఈ న్యూస్ ఈ ఫొటోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి..!!