సిద్ధార్థ్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి కారణం ఆవిడేనట!!

ఉదయ్ కిరణ్, తరుణ్, సిద్ధార్థ్….వీళ్లంతా ఒకానొకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలు. ఎన్నో ఏళ్ళు చిరంజీలో, బాలకృష్ణ , వేంకటేశ, నాగార్జున వంటి స్టార్ హీరోస్ మాత్రమే ఏలిన మన తెలుగు పరిశ్రమకు ఒక కొత్త ఎనర్జీని, ఉత్సాహాన్ని తెచ్చారు ఈ యువ కెరటాలు. వీళ్ళు చేసిన రొమాంటిక్ కామెడీ ఫిలిమ్స్, లవ్ స్టోరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. వీరిలో దురదృష్టవశాత్తు ఉదయ్ కిరణ్ స్వర్గస్థుడు కాగా, మిగిలిన ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీకి కాస్త దూరం గానే ఉన్నారు. తరుణ్ పూర్తిగా ఆక్టింగ్ పక్కన పెట్టేసాడు కానీ, సిద్ధార్థ్ ఇంకా ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

ఒకప్పుడు వరుస విజయాలతో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న సిద్ధార్థ్ సినీ కెరీర్ నాశనం అవ్వడానికి, అలాగే అతను తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సిద్ధార్త్ పర్సనల్ లైఫ్ ఎప్పుడు ఒక మిస్టరీ గానే ఉంటుంది. మొదట ఆయన మేఘన అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమెతో ఇద్దరు పిల్లల్ని కూడా కన్నాడనే వార్తలు వచ్చాయి. కానీ వీరి పిల్లల విషయం పై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కానీ నాలుగు సంవత్సరాల పాటు ఎంతో ప్రేమగా, చెట్టపట్టాలు వేసుకొని తిరిగిన ఈ ప్రేమ జంట విడిపోవడానికి కారణం సిద్ధార్థ్ మరో అమ్మాయితో తిరగడమేనట. ఆ అమ్మాయి ఎవరని ఆలోచిస్తున్నారా? ఆవిడే బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్.

సోహా అలీ ఖాన్….ఇది మనకు పెద్దగా పరిచయం లేని పేరు. సోహా అలీ ఖాన్ బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ చెల్లెలు. ఈమెతో కలసి తిరుగుతూ సిద్ధార్త్ చాలా సార్లు మీడియా కళ్ళలో పడ్డాడు. కానీ వీరి రిలేషన్షిప్ కూడా ఎక్కువ కాలం సాగలేదు. ఈమెతో సంబంధం పెట్టుకోవడం వల్లనే సిద్ధార్థ్ కు అతని మొదటి భార్య మేఘనకు మధ్య విభేదాలు వచ్చాయట. సినిమాలు చెయ్యకపోయినా తన రిలేషన్షిప్ స్టేటస్ తో ఎప్పుడు ట్రెండింగ్లో ఉండే సిద్ధార్థ్ ఇప్పుడు తాజాగా అదితి రావు హైదరి తో ప్రేమలో ఉన్నదంటూ వార్తలు వినిపిస్తున్నాయి.