“దేవర సినిమా ఆఫర్ నాకే రావాలి అని అలా కూడా చేశా”..నిజం ఒప్పేసుకున్న జాన్వీ కపూర్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న దివంగత హీరోయిన్ శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీదేవి ఎన్నో సినిమాల్లో నటించి అభిమానుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆమె మన మధ్య లేనప్పటికీ తన సినిమాల ద్వారా ఇంకా అభిమానుల చేత శభాష్ అనిపించుకున్న శ్రీదేవి కూతురు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ బ్యూటీ ఇప్పటివరకు సరైన హిట్ కొట్టలేదు . టాలీవుడ్ లోనూ జాన్వి కపూర్ ఎంట్రీ ఇచ్చింది .

ఎన్టీఆర్ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న “దేవర” సినిమాలో మొదటి హీరోయిన్గా సెలెక్ట్ అయింది జాన్వి కపూర్. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . అయితే ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉండగా జాన్వి కపూర్ కి ఇలాంటి ఆఫర్ ఎలా వచ్చింది..? అని అంతా అనుకున్నారు. ఇన్నాళ్లకు ఆ ఆఫర్ ఎలా వచ్చిందో చెప్పేసింది జాన్వికపూర్ .

“కొరటాల శివ గారు ఎన్టీఆర్ కాంబోలో సినిమా రాబోతుంది అని తెలియగానే ఈ సినిమాలో నేనే హీరోయిన్ అయితే బాగుండు అని ఎన్నోసార్లు అనుకున్నాను.. అయితే అదే టైంలో చాలామంది హీరోయిన్స్ ని అప్రోచ్ అవుతున్నారు అని విన్నాను .నన్ను కూడా అప్రోచ్ అయితే బాగుండు ఎని అనుకున్నాను. దేవుడికి దండం కూడా పెట్టుకున్నాను ..ఎన్నో పూజలు కూడా చేశాను . ఫైనల్లీ సక్సెస్ అయింది . కొరటాల శివ గారు మా నాన్న గారితో మాట్లాడారు.. వెంటనే నేను ఓకే చేసేసాను ..అలా ఈ ఆఫర్ నా చేతికి వచ్చింది. ఎన్టీఆర్ గారితో కలిసి నటించడం వర్క్ చేస్తూ ఉండడం నిజంగా నా అదృష్టం “అంటూ చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే ఇంత మంది హీరోయిన్లు ఉండగా జాన్వికి ఈ ఆఫర్ ఎలా వచ్చిందో బయట పడిపోయింది . అంతా దేవుడి దయ . జాన్విని ఎన్టీఆర్ నే తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయం చేయాలని రాసి పెట్టింది .అందుకే ముందు ఎన్ని సినిమాలు వచ్చినా పరోక్షంగా ఆఫర్స్ రిజెక్ట్ చేసింది జాన్వి..!!