జైలర్ సినిమాలో విలన్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న స్టార్ హీరో..!

కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్ ఈ సినిమా ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటించిన ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో రమ్యకృష్ణ, సునీల్ ,మోహన్లాల్ వంటి వారు కీలకమైన పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా భారీ అంచనాలు నెలకొంది. రజనీకాంత్ కు సరైన సక్సెస్ లేక చాలా కాలం అవుతొంది.ఈ సినిమాతో ఎలాగైనా సరే అభిమానులను మెప్పించాలని చాలా ఆత్రుతగా ఉన్నారు.

Kamal Haasan meets Rajinikanth, fans dub them 'legendary friendship goals'  - Hindustan Times

జైలర్ సినిమాలో ఒక విలన్ పాత్రని స్టార్ హీరో వదులుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రాన్ని వదులుకున్న హీరో ఎవరో కాదు కమలహాసన్. అయితే ప్రస్తుతం కమల్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని రజనీకాంత్ చేతిలో దెబ్బలు తినే సన్నివేశాలు చేయడం కరెక్ట్ కాదని జైలర్ చిత్ర బృందం. ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్రను తీసుకోలేదట. జైలర్ కమల్ చేయవలసిన రోల్ ఎవరు చేశారన్నది మరింత ఆసక్తికరంగా మారుతున్నది. ఈ చిత్రంలో మలయాళం హీరో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.

Kamal Haasan vs Rajinikanth: The clash of the titans

అయితే ఈ ఇద్దరిలో ఎవరు కమలహాసన్ ప్లేస్ ని రీప్లేస్ చేశారని విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది .ఈ విషయంపై ఇప్పటివరకు ఇంకా క్లారిటీ రాలేదు. మరి చిత్ర బృందం రాబోయే రోజుల్లో ఈ విషయం పైన క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం జైలర్ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్లో చిత్ర బృందం బిజీగా ఉన్నారు. నిన్నటి రోజున ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయక రజనీకాంత్ నెక్స్ట్ లెవెల్ లో పర్ఫామెన్స్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.