సాయి ప‌ల్ల‌వి నిత్యం అది తింటుందా.. ఇదేం అల‌వాటు రా బాబు..?!

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హోదాను అందుకున్న ముద్దుగుమ్మ‌ల్లో న్యాచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి ఒక‌టి. స్కిన్ షోకు, రొమాంటిక్ స‌న్నివేశాల‌కు ఈ బ్యూటీ ఎప్పుడూ దూర‌మే. అలాగే ఏ సినిమాకు ప‌డితే ఆ సినిమాకు ఒప్పుకోదు. పాత్ర‌కు ప్ర‌ధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌నే ఎంపిక చేసుకుంటుంది. ఎంచుకున్న పాత్ర‌కు వంత శాతం న్యాయం చేస్తుంది. అంతుకే సాయి ప‌ల్ల‌విని ఎంతో మంది ఇష్ట‌ప‌డుతుంటారు.

ఆమెకు సౌత్ లో స‌ప‌రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్ లో సాయి ప‌ల్ల‌విని లేడీ ప‌వ‌ర్ స్టార్ అని కూడా పిలుస్తుంటారు. అంత‌టి క్రేజ్ ను ఆమె సొంతం చేసుకుంది. అయితే ఏమైందో ఏమోగానీ.. ఈ మ‌ధ్య సినిమాలు చేయ‌డం బాగా త‌గ్గించేసింది. త‌మిళంలో క‌మ‌ల్ హాస‌న్ నిర్మాణంలో శివ‌కార్తికేయ‌న్ కు జోడీగా ఓ సినిమా చేస్తోంది. ఇది త‌ప్పితే మ‌రో ప్రాజెక్ట్ లేదు. వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నా కూడా.. ఆమె ఏ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం లేదు. పైగా ఈ మ‌ధ్య వెకేష‌న్స్, విహార‌యాత్ర‌లు అంటూ ఫ్యామిలీతోనే టైమ్ స్పెండ్ చేస్తుంది.

దీంతో ఈమె పెళ్లి చేసుకోబోతోందని.. డాక్ట‌ర్ గా సెటిల్ కాబోతోంద‌ని.. ఇలా ఎన్నో వార్త‌లు తెర‌పైకి వ‌చ్చాయి. కానీ, సాయి ప‌ల్ల‌వి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇదంతా ప‌క్క‌న పెడితే.. సాయి ప‌ల్ల‌వికి ఓ విచిత్ర‌మైన అల‌వాటు ఉంది. అదేంటంటే.. ఆమె నిత్యం విభూతి తింటుంద‌ట‌. సాయి ప‌ల్ల‌వికి ఆధ్యాత్మిక చింత‌న ఎక్కువ‌. ముఖ్యంగా ఆమె సాయి బాబాకు వీర భ‌క్తురాలు. అందుకే త‌న హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడూ విభూతిని క్యారీ చేస్తుంద‌ట‌. తినాల‌నిపించిన‌ప్పుడ‌ల్లా విభూతిని తింటుంద‌ట‌. ఇటీవ‌ల సాయి ప‌ల్ల‌వి స్వ‌యంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.