థియేటర్లో లాస్య హంగామా.. ఆ సినిమా చూస్తూ ప్ర‌పోజ్ చేసిన భ‌ర్త‌…రొమాంటిక్ వీడియో..!

ప్రముఖ బుల్లితెర యాంకర్ లాస్య ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు యాంకర్ రవితో కలిసి ప‌లు షోలు చేసిన లాస్య‌ తర్వాత మంజునాథను వివాహం చేసుకొని ఫ్యామిలీ లైఫ్ తో బిజీ అయిపోయింది. ఓ బాబు పుట్టిన తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా అవకాశం రావడంతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన లాస్య తనదైన స్టైల్ లో హౌస్‌లో ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న లాస్య బయటకు వచ్చిన తర్వాత తన ప్రతి అప్డేట్ ను యూట్యూబ్ ఛానల్ లో వీడియోల ద్వారా షేర్ చేసుకుంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవల మరో మగ బిడ్డకు జన్మనిచ్చిన లాస్య సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఆ బాబుకు సంబంధించిన ప్రతి ఫోటో , విడియోని షేర్ చేసుకుంటుంది. ఇటీవల లాస్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తన భర్తతో కలిసి థియేటర్లో హంగామా చేసింది లాస్య. సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీని థియేటర్లో చూడడానికి వచ్చిన ఈ జంట రొమాంటిక్‌గా అందరి ముందే రెచ్చిపోయి మరి డాన్స్ చేశారు. భర్త మంజునాథ్ థియేటర్లోనే లాస్యకు ప్రపోజ్ చేశాడు. ఆ సినిమాలో సీన్స్‌ని ఇమిటేట్ చేస్తూ లాస్య చేసిన రచ్చని ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తూ కామెంట్ చేశారు.

 

 

View this post on Instagram

 

A post shared by Lasya Manjunath (@lasyamanjunath)