బాబు నువ్వే మా జీవితంలో వెలుగులు నింపావంటూ నిహారిక పోస్ట్‌… ఎవ‌రా బాబు..!

మెగా డాటర్ నిహారిక జొన్నలగడ్డ చేతన్య‌ తో విడాకుల తర్వాత ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతూనే ఉంది. ఈమె ఏ పని చేసినా దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూనే ఉన్నారు నెటిజన్స్. సోషల్ మీడియా వేదికగా మేము విడాకులు తీసుకుంటున్నామంటూ అఫీషియల్ గా ప్రకటించిన నిహారిక, చైతన్య మా ప్రైవసిని డిస్టర్బ్ చేయవద్దు అంటూ మెసేజ్ పాస్ చేశారు. అయినా లెక్కచేయకుండా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వీరి విడాకులకు సంబంధించి పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటు చైతన్య కానీ అటు నిహారిక గాని ఈ వార్తలను పట్టించుకోవడం మానేశారు.

ఎవరి లైప్‌ను వారు ఎంజాయ్ చేస్తున్నారు. నిహారిక పెళ్లి జ్ఞాపకాలను మర్చిపోవ‌డానికి స్నేహితులతో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ గ్లామర్ ఫోటోషూట్స్ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. కెరీర్ పరంగా కూడా ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్న నిహారిక ఇటీవల డెడ్ పిక్సెల్ వెబ్ సిరీస్ తో భారీ సక్సెస్ సాధించింది. ప్రస్తుతం నిహారిక మరో సినిమాలో హీరోయిన్‌గా నటించబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా నిహారిక తన స్నేహితుడి గురించి షేర్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు కాలభైరవ నిహారికలు చిన్నపటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి చాలా మందికి తెలుసు. నేడు కాలభైరవ పుట్టినరోజు సందర్భంగా తన బెస్ట్ ఫ్రెండ్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్ చేసింది నిహారిక. ” హ్యాపీ బర్త్డే బాబు నువ్వు మా జీవితాల్లో వెలుగుని తీసుకొచ్చావ్ థాంక్స్ లెట్స్ హావ్ ఫ‌న్‌డే ” అంటూ రాసుకుంది. కాలభైరవతో తను దిగిన ఫొటోస్ తో ఈ మెసేజ్ ట్యాగ్ చేయడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.