చీర‌లో త‌మ‌న్నా సోయ‌గాలు.. ఇంత అందాన్ని చూశాకా చూపు తిప్పుకోగ‌ల‌రా..?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఈ వారంలో రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు రెడీ అవుతోంది. ఆగ‌స్టు 10న ర‌జ‌నీకాంత్ తో `జైల‌ర్‌` మూవీ ద్వారా సంద‌డి చేయ‌బోతోంది. అలాగే ఆగ‌స్టు 11న చిరంజీవి, త‌మ‌న్నా న‌టించిన `భోళా శంక‌ర్` విడుద‌ల కాబోతోంది. ఒక్క రోజు వ్య‌వ‌ధితో త‌న రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్న నేప‌థ్యంలో త‌మ‌న్నా ప్ర‌మోష‌న్స్ లో చాలా బిజీగా గ‌డుపుతోంది.

అటు జైల‌ర్ తో పాటు ఇలు భాళా శంక‌ర్ ను గ‌ట్టిగా ప్ర‌మోట్ చేస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ.. స్ట‌న్నింగ్ ఫోటో షూట్ల‌తో ఫాలోవ‌ర్స్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే ఎప్పుడూ మోడ‌ల్ దుస్తుల్లోనే క‌నిపించే త‌మ‌న్నా.. తాజాగా ప‌ట్ట చీర‌లో అస‌లైన అందాల‌ను రుచి చూపించింది.

ట్రెడీష‌న‌ల్ గా రెడీ అయ్యి అంద‌రి మ‌న‌సులు దోచేసింది. త‌న సోయ‌గాల‌తో చీర‌కు మ‌రింత అందాన్ని తెచ్చింది. త‌మ‌న్నా తాజా పిక్స్ చూశాకా చూపు తిప్పుకోవ‌డం కాస్త క‌ష్ట‌మే. ఎందుకంటే, ఆమె అందంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం త‌మ‌న్నా లేటెస్ట్ పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నారు. కాగా, కెరీర్ ప‌రంగా వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో దూసుకుపోతున్న మిల్కీ బ్యూటీ.. ప‌ర్స‌న‌ల్ లైఫ్ లోనూ జోరు చూపిస్తోంది. బాలీవుడ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ‌తో ప్రేమాయ‌ణం న‌డిపిస్తోంది. డేటింగ్ లో ఉన్న వీరిద్ద‌రూ ఎప్పుడెప్పుడు పెళ్లి పీట‌లెక్కుతారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)