మోక్షజ్ఞ సినీ..రాజకీయ ఎంట్రీ పై బాంబు పేల్చిన వేణుస్వామి.. టెన్షన్ లో ఫ్యాన్స్..!!

నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ విషయం కోసం బాలయ్య అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా నాలుగైదు సంవత్సరాలుగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు మోక్షజ్ఞ వార్తలు వినిపిస్తున్న ఇప్పటివరకు సరైన సమాచారమైతే లేదు. తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, మోక్షజ్ఞ గురించి తన కెరీర్ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతోంది.

బాలయ్య నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞ తేజ ను టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నట్టు తెలుస్తోంది.గతంలో కూడా బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతు ఆదిత్య 369 సీక్వెల్ సినిమాని తన డైరెక్షన్ లో తన కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నానని తెలిపారు. అఖండ సినిమా సమయంలో వేణు స్వామి బాలయ్య కుటుంబంతో కలవడం జరిగింది. బాలయ్యతో పాటు అక్కడ మోక్షజ్ఞను కూడా కలిసినట్లు తెలియజేశారు వేణు స్వామి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో యాంకర్ మోక్షజ్ఞ జాతకం చూసారా అని వేణు స్వామిని అడగగా దీనికి వేణు స్వామి మాట్లాడుతూ.. ఎందుకు చూడలేదు.. చూశాను మోక్షజ్ఞ జీవితం చాలా బాగుంది ఆయన సినీ కెరియర్ అయితే బాగానే ఉంటుంది.. కానీ ఆయన ఎంట్రీ ఇప్పట్లో ఉండకపోవచ్చు దాదాపుగా రెండు మూడు సంవత్సరాలు పడుతుంది అంటూ బాంబు పేల్చారు.. ఇప్పటికే లేట్ అవుతున్నది కానీ ఇంకా రెండు మూడు సంవత్సరాలు అంటే ఎలా అంటూ బాలయ్య అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు. మోక్షజ్ఞ సినిమాలలో అయితే బాగానే రానిస్తారు కానీ రాజకీయాల జోలికి పోరు అంటు తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.