ఆ హీరో మీద ఇష్టంతోనే అలాంటి పని చేస్తున్న నయనతార..!!

కోలీవుడ్లో సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార ఈసారి తన రూట్ ను మార్చబోతోంది.. తన ఇన్నేళ్ల సినీ కెరియర్లో కండిషన్స్ అప్లై చేస్తూ ఇప్పటివరకు పలు సినిమాలలో నటిస్తూనే ఉంది. అయితే ఇక మీదట తన కండిషన్లకు సైతం పుల్ స్టాప్ పెట్టె అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే తమిళ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.. ఇంతకీ నయనతార పెట్టిన కండిషన్ ఏంటి ఇప్పుడు ఆమె మనసు మార్చుకోవడానికి గల కారణాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం..

Shah Rukh Khan visits Nayanthara and her twin boys at her Chennai  apartment, blows flying kisses. Watch - India Today

లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిన నయనతార గతంలో సినిమా ప్రమోషన్స్ కి సైతం దూరంగా ఉండడం జరిగేది.. దాదాపుగా ఈమె 15 సంవత్సరాల నుంచి దూరంగానే ఉన్నట్టు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో నయనతార సినిమా ఫంక్షన్స్ కు ప్రెస్మీట్లో తెగ సందడి చేస్తూ ఉండేది.. కానీ ఆ తర్వాత తన జీవితంలో జరిగిన కొన్ని పర్సనల్ లైఫ్ వల్ల ఇబ్బందుల కారణంగా మీడియా ముందుకు రావడం మానేసింది నయనతార.. తాను ప్రమోషన్స్ కి రానని సినిమాలు సూపర్ హిట్టు కావడంతో అదే సెంటిమెంట్ ని కొనసాగిస్తూ ఉన్నది.

అయితే ఇప్పుడు తాజాగా ఈ సెంటిమెంటును పక్కనపెట్టి తన సొంత బ్యానర్లో సినిమాలు చేస్తూ ఉండడంతో ఆ సినిమా బాధ్యతలను తన మీద వేసుకుంది నయనతార.. ఇదే విషయం ట్రెండింగ్ లోకి తీసుకొని కంటిన్యూ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ తో నటిస్తున్న జవాన్ సినిమా విషయంలో ఇది నిజం కాబోతోందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. షారుక్ ఖాన్, నయనతార మధ్య మంచి బాండింగ్ ఉండడంతో జవాన్ సినిమా కోసమే ఈమె ఇలాంటి పనిచేయబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.