లవ్ బ్రేకప్ విషయంపై ఒక్క దెబ్బతో అందరి నోళ్ళు మూయించిన జబర్దస్త్ రీతూ చౌదరి..!!

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ బ్యూటీగా పేరుపొందింది రీతు చౌదరి.. వాస్తవానికి జీ తెలుగులో సీరియల్స్ చేస్తూ తన కెరీయర్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత ఒకసారిగా జీ తెలుగులో పాటలు పాడుతున్న యశస్విని హగ్ చేసుకుని అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసింది. దీంతో అప్పటినుంచి ఈమె పైన ట్రోల్స్ మొదలయ్యాయి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన క్రేజ్ అందుకున్న ఈమె సోషల్ మీడియాలో చేసే హంగామా గురించి చెప్పాల్సిన పనిలేదు..

 

ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్లకు హాట్ గ్లామర్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లోనే ఉంటుంది రీతూ చౌదరి..బుల్లితెరపై పలుషోలలో కూడా కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటుంది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. గతంలో శ్రీకాంత్ అనే వ్యక్తితో కలిసి దిగిన ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ ఈ బంధం కంటే ఏది గొప్పది కాదంటూ రాసుకొచ్చింది దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని విషయం వైరల్ గా మారింది.

 

అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ ఆమధ్య వార్తలు వినిపించాయి.. అయితే ఏమైందో తెలియదు కానీ కొద్దిరోజులుగా వీరిద్దరూ కలిసి కనిపించకపోవడంతో పాటు రీతూ తండ్రి మరణించడంతో ఆమెను ఓదార్చడానికి రాలేని క్రమంలో రీతూ శ్రీకాంత్ మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు కూడా వినిపించాయి. అంతేకాకుండా ఫోటోలన్నీ డిలీట్ చేయడంతో ఈ విషయానికి మరింత బలాన్ని చేకూర్చింది. గత కొద్ది రోజులుగా బ్రేకప్ రూమర్లు రావడంతో తాజాగా ఒక ఫోటోని షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.. అందులో ఆమె శ్రీకాంత్ తో కలిసి కనిపిస్తోంది. దీంతో ఎట్టకేలకు తన ఫోటోలతో ఒక క్లారిటీతో అందరికీ అదిరిపోయే సమాధానం ఇచ్చింది రీతూ చౌదరి.

 

View this post on Instagram

 

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)