బేబీ సక్సెస్ మీట్‌లో చిరంజీవి చేతికి పెట్టుకున్న ఈ వాచ్ అన్ని కోట్లా..? స్పెషాలిటీస్ ఇవే..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతుంది. అయితే ముఖ్యంగా సినీ లవర్స్ కు మాత్రం సోషల్ మీడియా చాలా మంచి పనులు చేస్తుంది . తమ అభిమాన హీరోలతో హీరోయిన్లతో డైరెక్ట్ గా మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం .. ఆ తర్వాత వాళ్లకు సంబంధించిన పలు రకాల వార్తలను తెలుసుకోవడం ..అంతేకాకుండా వాళ్లు వేసుకున్న ఖరీదైన బట్టలు – వాచెస్ డీటెయిల్స్ తెలుసుకోవడం ఎంతో వాళ్లకి ఆనందాన్నిస్తుంది .

ఈ మధ్యకాలంలో చాలా మంది స్టార్ సెలబ్రిటీస్ వేసుకున్న బట్టలు యాక్ససరిస్ కి సంబంధించిన డీటెయిల్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. కాగా గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి బేబీ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పెట్టుకున్న వాచ్ వైరల్ గా మారుతుంది. బేబీ సినిమా జులై 14 రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన చిరంజీవి తన మాటలతో తన వాక్చాతుర్యంతో అభిమానులను ఆకట్టుకున్నాడు.

ఈ క్రమంలోనే చిరంజీవి పెట్టుకున్న వాచ్ డీటెయిల్స్ వైరల్ గా మారాయి . మరీ ముఖ్యంగా చిరంజీవి తన చేతికి పెట్టుకున్న వాచ్ అభిమానులకి తెగ నచ్చేసింది . ఈ క్రమంలోనే ఆ వాచ్ డీటెయిల్స్ వైరల్ చేస్తున్నారు జనాలు. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం చిరంజీవి బేబీ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ లో పెట్టుకున్న వాచ్ ఖరీదు దాదాపు 1.89 కోట్లుగా తెలుస్తుంది . అంతేకాదు ఈ వాచ్ చాలా ప్రత్యేకమైనది. చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. మోస్ట్ కాస్ట్లీ.. చాలా రేర్ గా దొరుకుతూ ఉంటుందట . ఈ వాచ్ పేరు రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ఐ ఆఫ్ ది టైగర్ వాచ్.. చాలా తక్కువ మంది సెలబ్రిటీస్ వద్ద ఉంటుంది అం. తేకాదు మొదటినుంచి వాచెస్ అంటే చాలా ఇష్టమైన చిరంజీవి ఈ వాచ్ ని ఎంతో ఇష్టంగా కొనుక్కున్నారట . సోషల్ మీడియాలో ఈ వాచ్ డీటెయిల్స్ వైరల్ గా మారాయి..!!