శ్రీలీల చేసిన ఆ చిన్న తప్పు కారణంగానే.. రష్మిక మందన్నా పెళ్లి ఆగిపోయిందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల పేరు ప్రజెంట్ ఏ స్థాయిలో మారుమ్రోగిపోతుందో మనకు బాగా తెలిసిందే. సీనియర్ హీరో కాదు ..యంగ్ హీరో కాదు స్టార్ హీరో కాదు .. ఏ హీరో అయినా సరే మాకు శ్రీలీలనే కావాలి అంటూ భీష్ముంచుకుని కూర్చుంటున్నారు. ఆ స్థాయిలో శ్రీ లీల హవా కొనసాగుతుంది . అయితే ఇంతటి స్థాయిలో ఆమె హవ్వా కొనసాగటానికి కారణం ఆమె అందం ఒక ప్లస్ పాయింట్ అయితే.. ఆమెకున్న ఎనర్జీ లెవెల్స్ మరో ప్లస్ అని చెప్పాలి .

అంతేకాదు అదృష్టం హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని తిరిగినట్లు చేసిన ప్రతి సినిమా హిట్ అయిపోతుంది . ఇలాంటి క్రమంలోనే శ్రీలీల గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . నిజానికి శ్రీలీల తెలుగు ఇండస్ట్రీలో చలో అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది . ఆ సమయానికి కాల్ షీట్లు అడ్జస్ట్ కాక ఈ ఆఫర్ రిజెక్ట్ చేసింది . ఆ ఆఫర్ రష్మిక మందన్నా ఖాతాలో పడిపోయింది. చలో సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక తద్వారా తెలుగులో పాపులారిటీ సంపాదించుకొని స్టార్ హీరోయిన్గా మారింది .

అందుకే అప్పటికే నిశ్చితార్ధం చేసుకున్న ఆ సంబంధాన్ని బ్రేకప్ చెప్పేసింది. రష్మిక పెళ్లి ఆగిపోయింది . అయితే దీనంతటికి కారణం శ్రీలీల చేసిన చిన్న తప్పే అంటూ జనాలు మండిపడుతున్నారు. శ్రీ లీల కానీ ఆ రోజే చలో సినిమా చేసుంటే రష్మిక కి ఈ ఆఫర్ వచ్చుండేది కాదు . ఇప్పుడు ఇలా స్టార్ హీరోయిన్గా రాజ్యం ఏలేసి ఉండేది కాదు .. శుభ్రంగా పెళ్లి చేసుకుని పిల్లలను కనేసి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేసేది అంటూ చెప్పుకొస్తున్నారు. తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ రష్మిక మందనకు మంచే చేసింది ఈ కన్నడ పిల్ల..!!