ఇది నా విధిరాత.. అంటూ సంచలన పోస్ట్ చేసిన రేణు దేశాయ్..!!

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ తో విడాకులు వ్యవహారంపై ఎన్నోసార్లు ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది.. ముఖ్యంగా వీరి వ్యక్తిగత జీవితంలో తప్పొప్పులు ఎవరన్నది పక్కన పెడితే రేణు దేశాయ్ మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు టార్గెట్ చేస్తూ ఉంటారు.. ఈ క్రమంలోనే రకరకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. రేణు దేశాయ్ పైన కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కొన్నిసార్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడడం జరిగింది.

తాజాగా ఇదే అంశాన్ని గుర్తుచేసుకున్న రేణు దేశాయ్ మరొకసారి హాట్ టాపిక్ గా మారింది.. నా మాజీ భర్త ఎలా మోసం చేశాడు అనే అంశాన్ని గుర్తుచేస్తే.. ఎలాంటి పదజాలంతో దూషించారో తెలుసు.. అప్పుడు దేశ పౌరురాలిగా అతనికి అనుకూలంగా కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు అతని ద్వేషించే వారప్పుడు దుర్భాషలాడుతున్నారు.. విడాకుల గురించి నా మాజీ భర్త విషయంలో మాట్లాడిందంతా వాస్తవం అంటూ తెలియజేసింది. అయితే అలా మాట్లాడడంతో తాను డబ్బులు తీసుకొని మరి ఈ పని చేశానంటూ కొంతమంది కామెంట్లు చేశారు.

తాజాగా ఇలాంటి సన్నివేశమే మళ్లీ చోటుచేసుకుంది నా మాజీ భర్తకు వ్యతిరేకంగా ఉండే కొంతమంది నాకు డబ్బులు ఇచ్చారని ఆరోపిస్తున్నారనే విషయంలో ఎలాంటి నిజము లేదు నా మాజీ గురించి రెండు సందర్భాలలో ఒకే నిజం మాట్లాడాను అతనితో ప్రేమలో పడి నిజం మాట్లాడినందుకు ఇలా మూల్యం చెల్లించుకుంటున్నాను ఇది నా విధిరాత అయితే అలాగే వదిలేయండి అంటూ తెలియజేసింది.. దయచేసి ఎవరు తప్పుగా మాట్లాడకండి అంటూ వేడుకుంటున్నాను అంటూ ఇన్స్టాల్ లో కామెంట్లు చేయడం జరిగింది రేణు దేశాయ్.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)