మీరా జాస్మినా మ‌జాకా.. ఫైన‌ల్ గా అనుకున్న‌ది సాధించిందిరోయ్!

మీరా జాస్మిన్‌.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులో అనేక హిట్ సినిమాల్లో న‌టించి ఇక్క‌డి వారికి బాగా ద‌గ్గ‌రైన మీరా జాస్మిన్‌.. తమిళ, మలయాళ భాష‌ల్లోనూ సినిమాలు చేసింది. అయితే కెరీర్ పీక్స్ స్టేజ్ లోకి వెళ్తున్న స‌మ‌యంలో దుబాయ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్‌తో ఏడ‌డుగులు వేసింది. పెళ్లి త‌ర్వాత ఈ అమ్మడు వెండితెర‌పై కనిపించ‌లేదు.

అయితే మీరా వైవాహిక జీవితం కూడా ఎక్కువ కాలం కొన‌సాగ‌లేదు. పెళ్లైన మూడేళ్ల‌కే భ‌ర్త నుంచి విడాకులు తీసుకున్న మీరా జాస్మిన్‌.. దాదాపు ద‌శాబ్దం త‌ర్వాత సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. ఇప్ప‌టికే త‌మిళ్‌, మ‌ల‌యాళంలోకి రీఎంట్రీ ఇచ్చింది. ‘విమానం’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అయితే చిన్న చిన్న పాత్ర‌లు కాకుండా ఫుల్ లెన్తీ రోల్స్ కోసం మీరా ఆరాట‌ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలోనే నాలుగు ప‌దుల వ‌య‌సులో కూడా సోష‌ల్ మీడియా ద్వారా హాట్ హాట్ ఫోటో షూట్ల‌తో క‌వ్విస్తోంది.

ఫైన‌ల్ గా అనుకున్న‌ది సాధించింది. తెలుగులోయంగ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రీతూ వర్మ హీరోయిన్ గా ఎంపిక అయింది. `స్వాగ్` అనే టైటిల్ తో ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. అయితే ఇందులో ఓ ప్ర‌ధాన పాత్ర కోసం మేక‌ర్స్‌ మీరా జాస్మిన్ ను ఎంచుకున్నార‌ట‌. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి అయ్యాయ‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. కాగా, సమాజవరగమన వంటి సూప‌ర్ హిట్ అనంత‌రం శ్రీ‌విష్ణు రాబోతున్న చిత్ర‌మిది. ఈ మూవీతో స‌క్సెస్ ను కంటిన్యూ చేయాల‌ని శ్రీ‌విష్ణు ఆశ‌ప‌డుతున్నాడు.