ఇంట‌ర్నెట్‌ను షేక్ చేస్తోన్న మ‌హేష్‌బాబు ఫొటో…!

ప్రస్తుతం త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్లో గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు నటించిన సంగతి తెలిసిందే. మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీ లీల సెకండ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. గుంటూరు కారం సినిమా మహేష్ ఫొటోస్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ మొదలైన‌ దగ్గర నుంచి ఏదో ఒక కారణాలతో బ్రేక్ పడుతూనే ఉంది.

ఇటీవల సినిమాకు బ్రేక్ ఇచ్చిన మూవీ టీం ఈరోజు గురువారం నుంచి గుంటూరు కారం సినిమా కొత్త స్కెడ్యూలను ప్రారంభించారట. నిన్న మొన్నటి వరకు వెకేషన్ ఎంజాయ్ చేసినా మహేష్ బాబు కూడా సినిమా కోసం జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ తెగ కష్టపడి పోతున్నాడు. కొత్త సినిమా లుక్స్ కోసమే మహేష్ బాబు ఇలా వర్కౌట్ చేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఆగస్టు 18 నుంచి గుంటూరు కారం మూవీ సెట్స్‌లోకి మహేష్ బాబు కూడా అడుగుపెట్టబోతున్నాడట. అసలు గుంటూరు కారం షూటింగ్ ఆలస్యం అవుతుందని ఫ్యాన్స్ దిగులు పడుతున్న సందర్భంలో మహేష్ బాబు కొత్త లుక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ముందుగా అనుకున్నట్లే వచ్చే ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం మూవీ రిలీజ్ చేయబోతున్నారట.

 

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)