వరుసగా మూడు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు విడుదల.. ఫ్యాన్స్‌కు ఇక పండుగే..

చిన్న హీరోల సినిమాలను పక్కన పెడితే.. స్టార్ హీరోల సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు స్టార్ హీరోల సినిమాల గురించి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉంటారు. పెద్ద హీరోలకు ఉన్న క్రేజ్, వారి స్టార్ డమ్ కారణంగా వారి సినిమాలపై భారీ అంచనా ఉంటాయి. వీరి సినిమాలను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉంటారు. అలాగే తారాగణం కూడా పెద్ద సంఖ్యలో ఉంటుంది. సీనియర్ నటుటు కూడా వీరి సినిమాల్లో నటిస్తూ ఉంటారు.

అయితే టాలీవుడ్ నుంచి మూడు స్టార్ హీరోల సినిమాలు వరుసగా విడుదలకు సిద్దమవుతున్నాయి. నెలకో సినిమా విడుదల కానుంది. అవే పుష్ప2, దేవర, కల్కి 2898 ఏడీ. నెల నెలల గ్యాప్ లో ఈ మూడు సినిమాలు విడుదల కానుండటంతో బాక్సాఫీస్ ఇక షేక్ అవుతుందనే అంచనాలు సినీ వర్గాల్లో ఏర్పడ్డాయి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తునన్ పుష్ప2 మూవీ వచ్చే ఏడాది మార్చి 221న విడుదల కానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక పుష్ప2 విడుదల అయిన తర్వాత 15 రోజుల వ్యవధిలోనే దేవర సినిమా విడుదల కాబోతుంది. 2024 ఏప్రిల్ 5న జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమా విడుదల కానుంది. కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక యంగ్ రెబల్ స్టార్ హీరోగా తెరకెక్కుతోన్న కల్కీ 2898 ఏడీ సినిమాను తొలుత వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ వచ్చే ఏడాది మే9న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలస్తోంది. దేవర సినిమా విడుదలైన నెల రోజుల గ్యాప్ లోనే ప్రభాస్ సినిమా విడుదల కానుంది.