ఇంట్లో మిగిలిన భోజ‌నం పాడేస్తున‌నారా… వాటితో టేస్టీ వంట‌కం రెడీ ఇలా…!

ఒక్కోసారి మన ఇంట్లో అన్నం మిగిలిపోతూ ఉంటుంది. మిగిలిన అన్నాన్ని కొందరు తాలింపు వేసుకుని తింటూ ఉంటారు. మరికొందరు పడేస్తారు. ఇలా కాకుండా మిగిలిన అన్నంతో మనం ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే పునుగులను కూడా తయారు చేసుకోవచ్చు. అల్పాహారంగా తీసుకోవడానికి కూడా ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. మిగిలిన అన్నంతో చేసిన పునుకులు అంటే ఎవరు నమ్మరు కూడా. అంత రుచికరంగా ఉంటాయి. అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు ఎలా పునుగులను తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:
అన్నం రెండు కప్పులు, శనగపిండి ముప్పావు కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, క్యారెట్ తురుము అరకప్పు, కరివేపాకు ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర కొద్దిగా, చిన్నగా తరిగిన అల్లం ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం ఒక టీ స్పూన్, జీలకర్ర ఒక టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కు సరిపడా.

Rice in a bowl on a white background

తయారీ విధానం:
ముందుగా అన్నాన్ని జార్‌లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలని వేసి బాగా కలపాలి. అవసరమైనంత కొద్దిగా నీటిని జల్లుకొని పునుగుల పిండిలా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక పునుగుల్ల చిన్నచిన్నగా వేయాలి. ఇవి మీడియం మంటపై యాగనివ్వాలి. ఏదైనా చట్నీతో తింటే ఇవి చాల రుచిగా ఉంటాయి. ఇలా తయారు చేసుకుంటే చాలా రుచికరంగా పునుకులు వస్తాయి.