ఛాలెంజ్ చేసి అద‌ర‌గొట్టిన దీపిక‌… వీడియో వైర‌ల్‌..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమెకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ చాలెంజ్‌ను యాక్సెప్ట్ చేసిన దీపిక ఆ ఛాలెంజ్‌తో తన సత్తా చాటింది. తను నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎక్సర్సైజులు మొదలెట్టిన దీపిక జిమ్లో వ్యాయామాలతో పాటు క్యారెక్టర్ కు సరిపోయే ఫిజిక్ కోసం తెగ కష్టపడుతోంది. ఈ క్రమంలోనే తన ట్రైనర్ సమక్షంలో హులా హూప్‌ ఛాలెంజ్ లో ఈమె పాల్గొంది.

ఈ చాలెంజ్ సక్సెస్ఫుల్గా చేసి సక్సెస్ సాధించింది. ఒకసారి ఆమెను షేర్ చేసిన ఈ వీడియో చూస్తే హులా హూప్‌ చేయలేక అనేకసార్లు ప్రయత్నించి డీలా పడిపోయిన దీపిక మళ్ళీ పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఉంది. చివరకు ఆమె చాలెంజ్ లో సక్సెస్ అయింది. ఈ ఆనందకర విషయాన్ని తనే స్వయంగా వీడియో ద్వారా ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది.

కొంత బ్రేక్ తర్వాత మళ్లీ హెయిర్ స్టైలిస్ట్ పటోరితో హులా హూప్‌ ఛాలెంజ్ అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చింది. బ్లూ కలర్ డెనిమ్‌జిన్స్, బ్లాక్ కలర్ టాప్ లో బ్యూటిఫుల్ గా కనిపించిన దీపిక సెట్లో అందరిని ఎంటర్టైన్ చేస్తూ సందడి చేసింది. ప్రస్తుత ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వేరేలవుతుంది. చివరిగా జవాన్ లో గెస్ట్ రోల్ లో కనిపించిన‌ దీపిక పదుకొనే.. ప్రస్తుతం కల్కి 2898లో హీరోయిన్గా నటిస్తోంది.