‘బ్రో ది అవతార్’ దెబ్బ‌తో డేంజ‌ర్లో ప‌డ్డ RRR రికార్డులు..!

పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ మల్టీ స్టార‌ర్‌గా రూపొందిన బ్రోది అవతార్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఈ సినిమా రిమేక్ మూవీ కావడంతో నెగిటివ్ టాప్ ఎక్కువగా ఉంది. అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సముద్రఖ‌ని డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. త్రివిక్రమ్ పవన్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఈ సినిమాలో క్యారెక్టర్ డిజైన్ చేశాడంటూ వచ్చిన న్యూస్ తో ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది. అయితే ఈ సినిమా విడుదలైన తరువాత చివరి 20 నిమిషాలు తప్ప అసలు స్టోరీనే లేదన్న టాక్ బాగా వినిపించింది.

Bro Movie Day 1 Collection | Bro The Avatar | Worldwide Box Office -  StreamingDue.Com

దీంతో సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మొదటి రెండు రోజులు సూపర్ హిట్ రేంజ్ వసూళ్లు సాధించిన ఈ సినిమా అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసింది. ఫ్లాప్ సినిమా ఇంత వసూలు ఎలా వచ్చాయి అని అందరూ ఆశ్చర్యపోయారు ఫుల్ రన్ లో ఈ సినిమా కేవ‌ల్ రూ.70 కోట్ల రూపాయల ఫేర్‌లను వసూలు చేసి నష్టాలు తెచ్చిపెట్టింది. రీసెంట్ గా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. తెలుగు తో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయగా అక్కడి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు వర్షన్ టాప్ వన్ లో ట్రెండింగ్ అవుతుండగా..

RRR (2022) - IMDb

హిందీ వర్షన్ టాప్ 2 లో ట్రెండింగ్ అవుతుంది. బాలీవుడ్ లో ఈ సినిమా ఇలాగే ట్రెండ్ అయితే కచ్చితంగా ఆర్‌ఆర్ఆర్ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే బ్రో హిందీ వర్షన్ కు 50 మిలియన్ల వ్యూస్లు వచ్చాయి. ఇదే రేంజ్ లో ఒక వారం రోజులు కొనసాగితే కచ్చితంగా ఫుల్ రన్ లో బ్రో మూవీ 100 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంటుంది. థియేటర్స్ పరంగా ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ సాధించకపోయిన ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకొని ఫ్యాన్స్ కి కాస్త ఊరట నిచ్చింది.